Begin typing your search above and press return to search.

యువ దర్శ‌కుడిని చిక్కుల్లోకి నెట్టిన టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో బ‌ర్త్ డే!?

By:  Tupaki Desk   |   2 Sept 2021 2:13 PM IST
యువ దర్శ‌కుడిని చిక్కుల్లోకి నెట్టిన టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో బ‌ర్త్ డే!?
X
టాలీవుడ్ లో వ‌ర్గ పోరు.. కుల‌త‌త్వం.. గ్రూప్ రాజ‌కీయాల గురించి ఎప్పుడూ చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. ఇక టాలీవుడ్ అగ్ర కుటుంబంలో హీరోల న‌డుమ ఊహాతీత‌మైన పోటీ గురించి.. వారి మ‌ధ్య ఫ్యాన్ బేస్ విభ‌జ‌న గురించి చూడా నిరంత‌రం చ‌ర్చ చూసేదే.

కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీకి చెందిన ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఆహ్వానం అందుకుని కూడా ప్ర‌ముఖ హీరో బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన క‌మ్యూనిటీ మాటా మంతీ స‌మావేశానికి హాజ‌రు కాక‌పోవడంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ వేడెక్కిస్తోంది. అగ్ర హీరో బ‌ర్త్ డే పేరుతో ఒక క‌మ్యూనిటీని యూనిటీ చేసే ప్ర‌య‌త్నానికి ఈ వేదిక తెర తీసిందంటూ ఓవైపు చ‌ర్చ సాగుతున్న వేళ‌.. స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ ఆ పుట్టిన‌రోజు వేడుక‌లకు.. క‌మ్యూనిటీ స‌మావేశానికి డుమ్మా కొట్ట‌డంపై ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ సాగుతోంది.

నిజానికి ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఇలా స్కిప్ కొట్ట‌డానికి రెండు మూడు ప్ర‌ధాన కారణాల్ని హైలైట్ చేస్తూ క‌థ‌నాలు వండి వారుస్తున్నారు. వాటిలో ఒక‌ట.. స‌ద‌రు యువ‌ద‌ర్శ‌కుడు త‌న ఫ్రెండు అయిన అగ్ర హీరోతో స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని అత‌డి ఫ్యాన్స్ ని హ‌ర్ట్ చేయ‌కూడ‌ద‌నే ఈ బ‌ర్త్ డే వేడుక‌ల‌కు వెళ్ల‌లేద‌ని.. రెండోది క‌మ్యూనిటీ మీటింగుల‌తో ఇత‌ర క‌మ్యూనిటీల‌తో వైరం త‌ప్ప ఒరిగేదేమీ ఉండ‌ద‌ని ప‌లువురు నిరాశ‌ప‌ర‌చ‌డం వ‌ల్ల‌నే వెళ్ల‌లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ బ‌ర్త్ డే వేడుక‌ల‌కు ఆహ్వానిస్తూ త‌న పేరుతో ఆహ్వాన ప‌త్రిక ముద్రించేయ‌డంతో స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ ఎర‌క్క‌పోయి ఇర‌కాటంలో ప‌డిన‌ట్ట‌య్యింది. ఇక తాను స్కిప్ కొట్టినా త‌న నిర్మాతక కం ఫ్రెండు మాత్రం ఈ ఈవెంట్ కి అటెండ‌య్యారు. ప్ర‌ముఖ హీరోకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు.