Begin typing your search above and press return to search.

స్వీటీ అనుష్క‌కు యంగ్ డైరెక్ట‌ర్ బంప‌ర్ ఆఫ‌ర్

By:  Tupaki Desk   |   12 Jan 2022 6:35 AM GMT
స్వీటీ అనుష్క‌కు యంగ్ డైరెక్ట‌ర్ బంప‌ర్ ఆఫ‌ర్
X
`బాహుబ‌లి` సిరీస్ చిత్రాల‌తో స్వీటీ అనుష్క దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు అనుష్క‌ని పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా నిల‌బెట్టాయి. అయితే ఈ సినిమా త‌రువాత అనుష్క‌పై ఆఫ‌ర్ల వ‌ర్షం కురిసింది. బాలీవుడ్ నుంచి క‌ర‌ణ్ జోహార్ లాంటి డైరెక్ట‌ర్ త‌న‌ని బాలీవుడ్ లో ప‌రిచ‌యం చేస్తాన‌ని ఆఫ‌ర్ చేసినా అనుష్క పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌న‌కు న‌చ్చిన సినిమాల్లో మాత్ర‌మే న‌టిస్తాన‌ని, బాలీవుడ్ కు వెళ్లే ఉద్దేశం త‌న‌కు లేద‌ని చెప్పి షాకిచ్చింది.

`బాహుబ‌లి` త‌రువాత సెలెక్టీవ్ గా సినిమాలు చూస్తున్న అనుష్క క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో `నిశ్శ‌బ్దం` మూవీ చేసిన విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో మ‌రి కొంత స‌మ‌యం తీసుకున్న అనుష్క ప్ర‌స్తుతం మూవీ క్రియేష‌న్స్ న‌వీన్ పొలిశెట్టితో నిర్మిస్తోన్న ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తోంది అనుష్క‌. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ప్ర‌స్తుతం సైలెంట్ గా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ లో బిజీగా వుంది అనుష్క‌. ఇదిలా వుంటే తాజాగా స్వీటీ కి యంగ్ డైరెక్ట‌ర్ బంప‌ర్‌ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది. `భీష్మ‌`తో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌. ఈ మూవీ త‌రువాత కొంత విరామం తీసుకున్న వెంకీ కుడుముల మ‌హేష్ తో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు కానీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో మెగాస్టార్ చిరంజీవికి క‌థ వినిపించారు. ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మించ‌డానికి ముందుకొచ్చారు.

ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా నిర్మాత డీవీవీ దాన‌య్య ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇందులో చిరుకు జోడీగా ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా స్వీటీ అనుష్క న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది. ఇటీవ‌లే ఆమెతో చ‌ర్చించిన మేక‌ర్స్ స్వీటీని చిరుకు జోడీగా ఫైన‌ల్ చేశార‌ట‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి మునుపెన్న‌డూ లేనంత‌గా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ షాకుల‌మీద షాకులిస్తున్నారు. ప్ర‌స్తుతం `ఆచార్య‌`లో న‌టిస్తున్న చిరు మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా `గాడ్ ఫాద‌ర్‌`ని, త‌మిళ హిట్ చిత్రం ఆధారంగా `భోళా శంక‌ర్‌` ని చేస్తున్నారు. వీటితో పాటు బాబీ డైరెక్ష‌న్ లో ఓ మూవీని ప‌ట్టాలెక్కించారు. ఈ చిత్రాల‌తో పాటు తాజాగా వెంకీ కుడుముల చిత్రానికి ఓకే చెప్పేసిన విష‌యం తెలిసిందే.