Begin typing your search above and press return to search.

చిన్న సినిమాల‌కి స్టార్ హీరోయిన్ గా మారిపోయిన యంగ్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   16 April 2021 1:30 AM GMT
చిన్న సినిమాల‌కి స్టార్ హీరోయిన్ గా మారిపోయిన యంగ్ బ్యూటీ..!
X
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ 'ఉప్మా తినేసింది' అనే షార్ట్ ఫిల్మ్‌ లో నటనకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో 'దర్శకుడు' చిత్రంతో హీరోయిన్ గా మారిన పూజిత పొన్నాడ.. 'రంగస్థలం' 'కల్కి' సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఆహా ఓటీటీ కోసం 'రన్' అనే మూవీలో నటించింది. అందం అభినయం కలబోసిన ఈ బ్యూటీకి ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఫిల్మ్ న‌గ‌ర్ లో ఏ మూల‌కు వెళ్లినా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోందని తెలుస్తోంది.

పూజిత తెలుగమ్మాయి కావడం, లిప్ లాక్ సీన్ల‌కి కూడా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుండ‌టంతో చిన్న సినిమాల డైరెక్ట‌ర్లు ఈ బ్యూటీ వెనుక ప‌డుతున్నారని తెలుస్తోంది. అమ్మడి చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయంటేనే ఈ బ్యూటీ ఎంత బిజీగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. దర్శకుడు సంపత్‌ నంది రూపొందిస్తున్న 'ఓదెల రైల్వేస్టేషన్' లో పూజిత కీలక పాత్ర పోషించింది. అలానే గౌత‌మ్ కృష్ణ హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్న 'ఆకాశ వీధుల్లో' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల వదిలిన ఈ సినిమా పోస్టర్ లో హీరోతో లిప్ లాక్ చేసి అలజడి రేపింది.

ఏదేమైనా వరుస ఆఫర్స్ అందుకుంటున్న వైజాగ్ బ్యూటీ పూజిత.. చిన్న బ‌డ్జెట్ సినిమాల‌కి స్టార్ హీరోయిన్ గా మారిపోతోందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే బిజీగా ఉంటుంది కానీ, పెద్ద సినిమా వాళ్ల నుంచి ఇంకా అమ్మడికి ఛాన్సులు రావడం లేదు. పెద్ద సినిమా ఆఫర్ వచ్చి సరైన బ్రేక్ పడితే తెలుగు అందానికి తిరుగుండదని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో పూజిత పొన్నాడ చిన్న పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది.