Begin typing your search above and press return to search.

`వ‌ర్క్ ఫ్రం హోమ్` పై కుర్ర‌బ్యూటీ ఒపీనియ‌న్

By:  Tupaki Desk   |   28 Jan 2021 1:00 PM IST
`వ‌ర్క్ ఫ్రం హోమ్` పై కుర్ర‌బ్యూటీ ఒపీనియ‌న్
X
క‌రోనా ముందు క‌రోనా త‌ర్వాత‌..! ఉద్యోగాల్లో స‌న్నివేశం మారింది. ఆఫీస్ కి వ‌చ్చి ప‌ని చేయాలి అనే రూల్ కంటే `ఇంటి వ‌ద్ద నుంచే ఎక్కువ ప‌ని చేయించుకోవాలి!` అన్న కొత్త ఆలోచ‌నా తీరు ప్ర‌బ‌లంగా క‌నిపిస్తోంది. కొంద‌రు ఉద్యోగులు ఇంటి వ‌ద్ద నుంచి ప‌ని మ‌రీ క‌ష్టంగా ఉంది! అంటూ ఇబ్బందిని వ్య‌క్తం చేసేవారు ఉన్నారు. ఆఫీసుల్లో బాతాఖానీల‌కు ఆస్కారం లేదు.. బోర్ అని ఫీల‌య్యే యూత్ కి కొద‌వేమీ లేదు.

అయితే ఇంటి వ‌ద్ద నుంచి ప‌ని ఎలా ఉంటుంది? అని కుర్ర‌బ్యూటీ జాన్వీ క‌పూర్ ని అడిగేస్తే ఏమందంటే..! తన ఇంటి నుండి పని చేయాల్సిన సమయాన్ని ఆస్వాదించలేన‌ని జాన్వీ క‌పూర్ అభిప్రాయ‌ప‌డ్డారు. అస‌లు అలాంటి పని ఆస‌క్తిగా ఉండ‌దు అని కూడా అన్నారు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వి కపూర్ అభిప్రాయం ఇదీ.

జాన్వి కపూర్ ఎల్లప్పుడూ త‌న లైఫ్ ని సరదాగా స్పెండ్ చేసేందుకు ఆస‌క్తిగా ఉంటుంది. ఇన్ స్టాలో త‌న వృత్తిగ‌త వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్ని షేర్ చేసే విధానం దీనిని ఆవిష్క‌రిస్తుంది. తాజాగా జాన్వీ త‌న‌ చేతిలో స్టార్ బక్స్ డ్రింక్ తో పోజులిచ్చిన ఫోటోని షేర్ చేసింది.

``ఇంటి నుండి పని చేయండి.. వారు చెప్పినట్లు సరదాగా ఉంటుంది`` అన్న గుంభ‌న‌మైన వ్యాఖ్య‌ను జోడించి జాన్వీ త‌న అనాస‌క్తిని వ్య‌క్త‌ప‌రిచింది. ఈ శీర్షికతో ఉన్న చిత్రాలలో ల్యాప్ ‌టాప్ ముందు కూర్చొని ఉన్న జాన్వీ ఫోటో క‌నిపిస్తోంది.

కెరీర్ సంగ‌తి చూస్తే.. జాన్వి ప్ర‌స్తుతం వ‌రుస‌ ప్రాజెక్టులతో బిజీ. దోస్తానా 2 లో కార్తీక్ ఆర్యన్ - లక్ష్ లాల్వానీలతో పాటు న‌టిస్తోంది. రాజ్ కుమార్ రావుతో రూహి అఫ్జానా రిలీజ్ కావాల్సి ఉంది. కరణ్ జోహార్ తఖ్త్ లో జాన్వి కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది.

తన తదుప‌రి చిత్రం `గుడ్ లక్కీ జెర్రీ` పంజాబ్ లో చిత్రీకరణలో ఉంది. అయితే తాజా అల్ల‌ర్లు.. కేంద్రంపై భారీ రైతు నిరసనల కారణంగా రెండుసార్లు షూట్ ని ఆపవలసి వచ్చింది. ఫతేగ‌ర్ సాహిబ్ దగ్గర షూటింగ్ కి తొలిగా అంత‌రాయం ఏర్ప‌డింది. పాటియాలాలోనూ షూట్ కి అంత‌రాయం త‌ప్ప‌లేదు.