Begin typing your search above and press return to search.

ఇట్స్ ఏ మిరాకిల్ః స్టార్ హీరోయిన్ కు ప‌డిపోయిన యంగ్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   27 March 2021 8:00 AM IST
ఇట్స్ ఏ మిరాకిల్ః స్టార్ హీరోయిన్ కు ప‌డిపోయిన యంగ్ బ్యూటీ!
X
ఆఫ్ స్క్రీన్ లో.. హీరోయిన్ హీరోకు ప‌డిపోతే కామ‌నే అనేసుకోవ‌చ్చు. అవ‌కాశాలూ గ‌ట్రా ఉంటాయి కాబ‌ట్టి ద‌టీజ్ కామన్ థింగ్‌. హీరోయిన్ కు హీరో ఫిదా అయ్యాడంటే.. కాస్త‌ వెరైటీగానే అనిపించినా ఏదో ఒక రీజ‌న్ అప్లై చేసేసుకొని బుర్ర‌ను శాంతిప‌జేసుకోవ‌చ్చు. కానీ.. హీరోయిన్ కు మ‌రో హీరోయిన్ ప‌డిపోతే..? ఇది ఖ‌చ్చింగా మిరాకిలే. అద్భుతానికి ఆధారాలు గుర్తించ‌డం అంత ఈజీ కాదుకాబ‌ట్టి.. ఈ మ‌ర్మాన్ని తేలిగ్గా ప‌సిగ‌ట్ట‌లేం. బాలీవుడ్ లో ఇదే అద్భుతం జ‌రిగింది. ఇంకా జ‌రుగుతూనే ఉంది. ఓ హీరోయిన్ అదే ప‌నిగా మ‌రో హీరోయిన్ ను ల‌వ్ చేస్తోంది!

అవును.. ఆమే యంగ్ బ్యూటీ అన‌న్య పాండే. ఈమె ల‌వ్ చేస్తున్న‌ది ఎవ‌రినంటే బీటౌన్ క్వీన్ దీపికా ప‌దుకొణెను! ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న దీపికాపై మ‌న‌సు పారేసుకున్న అన‌న్య‌.. ఆ విష‌యాన్ని సందుదొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌పంచానికి చెప్పేస్తోంది. ‘ఆర్య‌’లో బన్నీ థియరీని అప్పజెప్తున్న అనన్య.. తనలో దీపికపై దాచుకోలేనంత ప్రేమ ఉందని అంటోంది.

వీరిద్ద‌రూ క‌లిసి దర్శ‌కుడు శ‌కుని బ‌త్రా తెర‌కెక్కిస్తున్న సినిమాలో న‌టిస్తున్నారు. దీపిక‌ను తాను సిస్ట‌ర్ అని పిలుస్తాన‌ని చెబుతున్న అన‌న్య‌.. ఆమె అందం అమోఘం అంటోంది. ఆమె ఏ చీర క‌ట్టినా.. ఆ చీర‌కే అందం వ‌చ్చేస్తుంద‌ని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇక‌, చివ‌ర‌గా.. నేను గ‌ట్టిగా కౌగిలించుకునే హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారంటే.. అది దీపిక మాత్ర‌మే అని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. మొత్తానికి అన్య‌ను ఫ్లాట్ చేసింది దీపిక‌. కార‌ణ‌మేంటో మీకేమైనా అర్థ‌మైందా?