Begin typing your search above and press return to search.

హ‌డ‌లెత్తించిన యంగ్ బ్యూటీ బోల్డ్ బికినీ షూట్

By:  Tupaki Desk   |   2 Sept 2021 8:00 PM IST
హ‌డ‌లెత్తించిన యంగ్ బ్యూటీ బోల్డ్ బికినీ షూట్
X
ముంబై బ్యూటీ అమైరా ద‌స్తూర్ టాలీవుడ్ కి సుప‌రిచితం. `మ‌న‌సుకు న‌చ్చింది` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అటుపై `రాజుగాడు` చిత్రంలో న‌టించింది. సందీప్ కిషన్.. రాజ్ త‌రుణ్ లాంటి యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీకి తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలేవీ రాలేదు. ఈ రెండు చిత్రాలు ఫ్లాపుల‌వ్వ‌డం కూడా అమైరాకు మైన‌స్ అయ్యింది. అటుపై అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. దీంతో మ‌ళ్లీ బాలీవుడ్ కే వెళ్లిపోయింది. అక్క‌డ బిజీ న‌టిగానే కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో `భ‌గీర` అనే చిత్రంలో న‌టిస్తోంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ ల్లోనూ న‌టిస్తోంది. ఇలా సినిమాలు.. వెబ్ సిరీస్ ల‌తో హిందీలో బిజీ నాయిక‌గానే మారింది. మ‌రి అమైరాలో మ‌రో కోణం అంద‌రికీ తెలిసిన‌దే.

సోష‌ల్ మీడియాలో టెప్టింగ్ ఫోటోల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కించ‌డం అమైరా ప్ర‌త్యేక‌త‌. హ‌ద్దు మీరి టూమ‌చ్ గా ర‌చ్చ చేయ‌డం ఈ సొస‌గ‌రి స్పెషాలిటీ. ఇటీవ‌ల స్నేహితుల‌తో పూల్ సైడ్ స్నేహితుల‌తో క‌లిసి చిలౌట్ అవుతున్న కొన్ని హాట్ ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. డీప్ వాట‌ర్ లో ఈత దుస్తుల్లో ఈత కొడుతూ క‌నిపించింది. ఆ త‌ర్వాతా వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతూనే ఉంది.

తాజాగా త‌న‌లోని దాప‌రికం లేని యాటిట్యూడ్ ని అమైరా బ‌య‌ట‌పెట్టింది. పేలిక‌ల్లాంటి రెండు వ‌స్త్రాల్ని త‌న అందాలను క‌వ‌ర్ చేస్తూ అమైరా ఫోటోషూట్ ప‌బ్లిక్ కి లీక్ చేసింది. బూడిద రంగు టూపీస్ లో పూల్ సైడ్ కొంటె చూపుల‌తో హోయ‌లు పోతున్న ఫోటోల్ని అభిమానుల‌కు ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది.

త‌న‌లో బోల్డ్ యాంగిల్ ని టూమచ్ గానే ఎలివేట్ చేసింది అమైరా. టాప్ టూ బాట‌మ్ 360 డిగ్రీస్ భంగిమ‌ల్ని ఎలివేట్ చేసింది ఈ ఫోటోషూట్. గ‌తంలో ఎన్న‌డు ఇంత హాట్ గా బికినీలో ర‌చ్చ చేయ‌లేదు. తొలిసారి హ‌ద్దు మీర‌డంతో ఇన్ స్టాలో కామెంట్లు మంట‌లు రేపుతున్నాయి. కొంత మంది ఫాలోవ‌ర్స్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డితే.. మ‌రికొంద‌రు అమైరా హ‌డ‌లెత్తించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. త‌న‌తో పాటు త‌న స్నేహితులు కూడా మోడ‌ల్స్ కాక‌పోయినా ఈ రేంజులో మంట‌లు పుట్టిస్తున్నారేమిటి? అంటూ నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి వీటిపై అమైరా వివ‌ర‌ణ ఇస్తుందేమో చూడాలి.