Begin typing your search above and press return to search.

రానాకు డాడీ నుంచి అబ్బిన వ్యాపార ల‌క్ష‌ణమిదే!!

By:  Tupaki Desk   |   23 July 2020 9:45 AM IST
రానాకు డాడీ నుంచి అబ్బిన వ్యాపార ల‌క్ష‌ణమిదే!!
X
ఓవైపు సాటి హీరో నితిన్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. పూర్తిగా పెళ్లి సంబ‌రాల్లో మునిగి తేలుతున్నాడు. ఈనెల 26న నితిన్ వివాహం షాలినితో జ‌ర‌గ‌నుంది. అయితే రానా కూడా పెళ్లి కొడుకు అయ్యాడు క‌దా? ప‌్ర‌స్తుతం అత‌డు ఏం చేస్తున్నాడు? అంటే..

ఓవైపు తాను వ‌ల‌చిన మిహీక బ‌జాజ్ ను పెళ్లాడేందుకు ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నా.. మ‌రోవైపు అత‌డు ఇత‌ర‌త్రా బిజినెస్ వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌బెడుతుండ‌డం ఆస‌క్తిక‌రం. రానా ఇప్ప‌టికిప్పుడు ప‌లు భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు పావులు క‌దుపుతున్నాడు. మ‌రోవైపు రీమేక్ హ‌క్కుల్ని కొన‌డం వాటి తెలుగు రీమేక్ లు ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతాయి? అన్న‌ది రివ్యూలు చేయ‌డం.. డైరెక్ట‌ర్ల ఎంపిక‌.. వేరొక వైపు డాడీ సురేష్ బాబుతో క‌లిసి స్క్రిప్టుల్ని వండించ‌డం వ‌గైరా పనుల్లో బిజీ.

అదంతా అటుంచితే మ‌రోవైపు ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఓటీటీ బిజినెస్ పైనా రానా క‌న్ను ప‌డింది. అత‌డు ఏదీ వ‌దిలిపెట్ట‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్ ల రైట్స్ కొనుక్కుని వాటిని తెలుగైజ్ చేయ‌డ‌మే గాక ఇండియా వైడ్ మార్కెటింగ్ పైనా దృష్టి సారిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ ప్ర‌తినిధుల‌తో మంత‌నాలు సాగిస్తున్నాడట‌. అలాగే సొంతంగా ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ రూప‌క‌ల్ప‌న‌లోనూ బిజీ బిజీ అట‌.

అయినా దీపం ఉండ‌గానే ఓటీటీని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్న‌మే ఇది. తండ్రి సురేష్ బాబు నుంచి అబ్బిన వ్యాపార ల‌క్ష‌ణాలు రానాను ఖాళీగా ఉండ‌నివ్వ‌డం లేదు మ‌రి. ఓవైపు పెళ్లి మ‌రోవైపు ఓటీటీ ఏమిటో రానా. ఎందుకింత బిజీ? అయినా ఆగ‌స్టు 8న పెళ్లి పెట్టుకుని యువ‌హీరో ఇంత బిజీ అయితే ఎలా?