Begin typing your search above and press return to search.

అదితిరావు హైదరీ కథ వింటే ఆశ్చర్యపోతారు

By:  Tupaki Desk   |   10 Jun 2020 5:00 AM GMT
అదితిరావు హైదరీ కథ వింటే ఆశ్చర్యపోతారు
X
అదితిరావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు ‘సమ్మోహనం’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. సుధీర్ బాబు హీరో. ఈ చిత్రం విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈమె తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈమె మన తెలుగమ్మాయే. కానీ చాలామందికి తెలియదు.. స్వయానా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఆమె పుట్టింది. బాల్యం అక్కడే సాగింది. హైదరాబాద్, ఢిల్లీ లో పెరిగింది.

అయితే ‘అదితిరావు హైదరి’ పేరు వెనుక ఆసక్తికర స్టోరీనే ఉంది. ఆమె తెలంగాణలోని రాజవంశమైన వెలమ ‘రావు’ల కుటుంబానికి.. ముస్లింలో రాజవంశమైన హైదరీ కుటుంబానికి చెందింది. ఎందుకంటే.. అదితి తల్లి శాంతా రామేశ్వరరావు , తండ్రి ఇషాన్ హైదరీ.. వీళ్లద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అదితి చిన్నప్పుడే వీరిద్దరూ విడిపోయారు. అందుకే తల్లిపేరు చివరన ఉన్న రావును.. తండ్రి పేరు చివర ఉన్న హైదరీని కలిపి అదితి ఫుల్ పేరు పెట్టుకుంది. తండ్రి కూడా ఇప్పటికీ తనను ప్రేమగా చూసుకుంటాడని ఆమె తెలిపింది. ఆ తర్వాత అదితి తల్లి ఢిల్లీకి వెళ్లిపోవడంతో అక్కడే ఇంటర్, డిగ్రీ చదువుకుంది.దీంతో అదితికి తెలుగు, హిందీ అనర్ఘళంగా వచ్చు.

హైదరీ సమ్మోహనం సినిమాలో ‘ఓచెలి తారా’ అనే పాట కూడా తెలుగులో పాడడం విశేషం. ఈమె ఇదివరకే ఏఆర్ రెహ్మాన్ సారథ్యంలో వచ్చిన ‘వాన్ వరువాన్’ పాటను పాడి అందరి హృదయాలను కొల్లగొట్టింది. హైదరీకీ గాత్రం ఆమె తల్లి నుంచి వచ్చింది.

అదితి రావు హైదరీ 1986 అక్టోబర్ 28న వనపర్తిలో జన్మించారు. ఈషాన్ హైదరీ, శాంత రామేశ్వరరావు ఈమె తల్లిదండ్రులు. బాల్యం విద్యాభాస్యం మొత్తం మదనపల్లి రిషి వ్యాలీలో సాగింది. ఈమె తల్లి విద్యారావు ప్రముఖ హిందూస్థానీ సంగీత విధ్వాంసురాలు. ఆమెను చూసే పాటలు పాడడం నేర్చుకొని మొదట సింగర్ గా రాణించింది. 2006లో మళయాళంలో వచ్చిన ‘ప్రజాపతి’ మూవీ ద్వారా ఈమె సినిమాల్లోకి ప్రవేశించింది. 2011లో సుధీర్ మిశ్రా తీసిన ‘యే శాలి జిందగీ’ మూవీ నటనకు హైదరీకి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో నటనకు స్క్రీన్ అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది.

చాలా హిందీ సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు పోహించింది. 2011లో వచ్చిన రాక్ స్టార్ సినిమా అధితికి మంచి పేరు తీసుకొచ్చింది. 2014లో వచ్చిన కూబ్ సూరత్ కూడా పేరు తెచ్చింది. 2016లో వచ్చిన వాజీర్ మూవీ హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగింది. 2018లో భూమి అనే సైంటిఫిక్ చిత్రంలో నటించి మెప్పించింది.

ఇక అదిథి రావు పెళ్లి అయ్యాక కూడా హీరోయిన్ గా రాణిస్తుండడం విశేషంగా చెప్పవచ్చు. ఆమె 2009లో సత్యదీప్ మిశ్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ బాలీవుడ్ టెలివిజన్ యాక్టర్ ను పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటోంది. ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయిందనే ప్రచారం ఉంది.