Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ నానికి ద‌క్కిన మెగా గౌర‌వం

By:  Tupaki Desk   |   21 Jan 2022 7:49 AM GMT
నేచుర‌ల్ స్టార్ నానికి ద‌క్కిన మెగా గౌర‌వం
X
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీలో హీరో నాని రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించిన ఆక‌ట్టుకున్నారు. ఓ పాత్ర‌లో ఫిల్మ్ మేక‌ర్ వాసుదేవ్ గా , మ‌రో పాత్ర‌లో శ్యామ్ సింగ రాయ్ గా నాని ప‌లికించిన హావ భావాలు ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీల‌నీ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. డిసెంబ‌ర్ 24న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌లైన ఈ చిత్రం యునానిమ‌స్ గా సూప‌ర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

వ‌సూళ్ల ప‌రంగానూ నాని న‌టించిన గ‌త చిత్రాల‌కు మించి భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఇందులో నాని పోషించిన శ్యామ్ సింగ రాయ్‌, దేవదాసిగా రోజీ పాత్ర‌లో న‌టించిన సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కోల్ క‌తా నేప‌థ్యంలో టైమ్ ట్రావెల్ క‌థ‌గా స‌రికొత్త క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం విడుద‌లై దాదాపు నెల రోజులు కావ‌స్తున్నా ఈ మూవీ పై క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. తాజాగా ఈ మూవీని ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ లో ఈ శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు కురిసిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వుంది. ఇటీవ‌ల ఈ చిత్రం పై స్టార్ హీరో మెగా ప‌వ‌ర్ స్టార్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాని, సాయి ప‌ల్ల‌విల కెరీర్ బెస్ట పెర్పార్మెన్స్ ని ఈ మూవీలో ప్ర‌ద‌ర్శించారని కొనియాడారు రామ్ చ‌ర‌ణ్‌. అంతే కాకుండా ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన కృతిశెట్టితో పాటు లాయ‌ర్ గా కీల‌క పాత్ర‌లో న‌టించిన మ‌డోన్నా సెబాస్టియ‌న్ ని కూడా అభినందించారు.

తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా తిల‌కించిన మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు హీరో నేచుర‌ల్ స్టార్ నానిని త‌మ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యాన్నిచ్చి ప్ర‌త్యేకంగా అభినందించ‌డం విశేషం. ఈ మ‌ధ్య కాలంలో మెగాస్టార్ ఫ్యామిలీ ఓ హీరోని ఇంటికి పిలిచి ఆతిథ్యాన్నిచ్చి మ‌రీ అభినందించ‌డం ఇదే ప్ర‌ప్ర‌ధ‌మం కావ‌డంతో నేచుర‌ల్ స్టార్ కి మెగా ఫ్యామిలీ దంప‌తుల అభినంద‌ల‌న రూపంలో అరుదైన గౌర‌వం ద‌క్కింద‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మెగాస్టార్ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఇంటికి వెళ్లిన నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌త్యేకంగా మెగా దంప‌తులు మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ తో క‌లిసి త‌న సినిమా సంగ‌తుల్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.