Begin typing your search above and press return to search.

తారకరత్న కొత్త అవతారం

By:  Tupaki Desk   |   19 Feb 2016 9:30 AM GMT
తారకరత్న కొత్త అవతారం
X
ఒకేసారి తొమ్మిది సినిమాల ప్రారంభోత్సవంతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు నందమూరి తారకరత్న. కానీ ఆ తొమ్మిదిలో నాలుగో ఐదో మాత్రమే పూర్తయి విడుదలయ్యాయి. అవి ఆడలేదు. మిగతావి మొదలే కాలేదు. వేరే సినిమాలు కొన్ని చేశాడు కానీ.. అవి కూడా నిరాశనే మిగిల్చాయి. ఓ దశలో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ మళ్లీ కొన్ని అవకాశాలు దక్కించుకున్నాడు నందమూరి కథానాయకుడు. ఐతే ఏం లాభం.. సినిమాలు పూర్తవుతున్నాయి కానీ, విడుదలకే నోచుకోవట్లేదు. నేను చాలా వరస్ట్ అని.. కాకతీయుడు అని.. ఇంకా ఏవో మూణ్నాలుగు సినిమాలకు మోక్షం కలగకుండా ల్యాబుల్లో మగ్గుతున్నాయి.

ఇలాంటి స్థితిలో ‘ఎవరు’ అంటూ ఇంకో కొత్త సినిమాతో రెడీ అయ్యాడు తారకరత్న. రమణ సాల్వ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ నిన్నే రిలీజైంది. ఇదో హార్రర్ సినిమా అని ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఓ కొత్తమ్మాయి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో తారకరత్న కొత్త గెటప్‌ లో దర్శనమిస్తున్నాడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి లాంటి పేరున్న రచయితలు సాహిత్యం అందించడం విశేషం. ముప్పా అంకమ్మ చౌదరి, లింగా శ్రీనివాసరావు అనే కొత్త నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ సినిమా తారకరత్నకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.