Begin typing your search above and press return to search.

ఆ చిన్న‌ది మతం మారింది అందుకేన‌ట‌

By:  Tupaki Desk   |   27 July 2017 5:54 AM GMT
ఆ చిన్న‌ది మతం మారింది అందుకేన‌ట‌
X
ప్ర‌ముఖ సినీన‌టుడు.. విశ్వ‌క‌థానాయ‌కుడిగా పేరున్న క‌మ‌ల్ హాస‌న్ రెండో కుమార్తె అక్ష‌ర హాస‌న్ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ మ‌ధ్య‌నే ఈ చిన్న‌ది మ‌తం మారారు. చిన్న‌త‌నం నుంచి ద‌ర్శ‌క‌త్వం మీద మ‌క్కువ ఉంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. ష‌మితాబ్ చిత్రంతో ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యమైంది.

బుజ్జి బుజ్జి అందాల‌తో ముచ్చ‌ట‌గా ఉండే అక్ష‌ర‌హాస‌న్ ప్ర‌స్తుతం స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న వివేగంలో నటిస్తూ కోలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇటీవ‌ల చెన్నైలోని మీడియాతో మాట్లాడిన అక్ష‌ర హాస‌న్ ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పారు. తాను వ్య‌క్తిగ‌తంగా మ‌తం మారిన కార‌ణాన్ని బ‌య‌ట‌పెట్టారు.

ఆస్తిక‌త్వం మీద త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని.. అందుకే బౌద్ద‌మ‌తానికి మారిన‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. త‌న తండ్రి.. త‌ల్లి.. అక్క‌.. బంధువులు అంతా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనే ఉన్నార‌ని.. అంద‌రితో ఒక మూవీ చేయాల‌ని త‌న‌కు ఉంద‌న్న ఆమె.. ద‌ర్శ‌కురాలిగా ఒక విజ‌యం సాధించిన‌త‌ర్వాత మాత్ర‌మే తాను అమ్మానాన్న అక్క‌ల కాల్ షీట్లు తీసుకొని సినిమా చేస్తాన‌ని చెప్పింది.

త‌న తండ్రి పొలిటిక‌ల్ ఎంట్రీ మీద జోరుగా వ‌స్తున్న వార్త‌ల్ని ఆమె ఎదుట ఉంచ‌గా.. ఆ విష‌యంలో తాను మాట్లాడేదేమీ లేద‌ని.. అది త‌న తండ్రి ఇష్ట‌మంటూ తెలివిగా స‌మాధానం చెప్పి వెళ్లిపోయింది.