Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ‘యెస్ బ్యాంక్’

By:  Tupaki Desk   |   6 March 2020 4:20 PM IST
టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ‘యెస్ బ్యాంక్’
X
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే.. ప్రైవేటు బ్యాంకు కదా అని యెస్ బ్యాంకు లో మన టాలీవుడ్ స్టార్లు ఇబ్బడిముబ్బడిగా డబ్బు దాచేసుకున్నారు. ఇప్పుడదే వారి కొంప ముంచుతోంది.

టాలీవుడ్ ను యెస్ బ్యాంక్ టెన్షన్ పెడుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘యెస్ బ్యాంకుపై ’ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ బ్యాంకు ఖాతాదారులు ఒక నెలలో కేవలం రూ.50వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేదని షరతు విధించింది. వారి ఖాతాల్లో లక్షలు, కోట్లు ఉన్నా సరే నెలలో రూ.50వేలకు మించి ఉపసంహరించుకోవడానికి వీల్లేకుండా నిబంధనలు మార్చేసింది.

టాలీవుడ్ కు సంబంధించిన చాలా ప్రముఖులకు ఈ ప్రైవేటు యెస్ బ్యాంకులో ఖాతాలున్నట్టు తెలిసింది. ప్రైవేటు బ్యాంకు కావడం.. స్టార్ల గుట్టుమట్లను బయట పెట్టక పోవడంలాంటి వాటితో పాటు ఎన్నో సదుపాయాలు ఈ బ్యాంకు కల్పించడంతో ఇందులో లక్షలు, కోట్లు కూడా డిపాజిట్ చేసి నిర్వహిస్తున్న సినిమా ప్రముఖులున్నారట.. ఇప్పుడు పెద్ద ఎత్తున డబ్బు ఉన్నా దాన్ని విత్ డ్రా చేసుకోవడానికి వారికి చాన్స్ లేకుండా పోయింది.

ప్రధానంగా గీతా ఆర్ట్స్, దిల్ రాజ్ బ్యానర్స్, సురేష్ మూవీ సంస్థలకు చెందిన ప్రైమరీ, సెకండరీ ఖాతాలు యెస్ బ్యాంకులోనే ఉన్నాయట.. ఇప్పుడు ఇందులో కోట్లు పెట్టుకున్న నిర్మాణ సంస్థలకు ఆర్బీఐ నిషేధం శరాఘాతంగా మారిందట.. యెస్ బ్యాంకు సమస్య ఎప్పుడు తీరుతుందో అప్పుడే వీరి చేతికి ఆ సొమ్ము అందనుంది.