Begin typing your search above and press return to search.
భూమా మౌనికకు మనోజ్ స్పెషల్ గిఫ్ట్ - సాంగ్ అదిరిందిగా!
By: Tupaki Desk | 18 April 2023 5:03 PM ISTసినీ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో చాలా సింపుల్ గా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మనోజ్ సోదరి.. మంచు లక్ష్మియే దగ్గరుండి వీరిద్దరికి పెళ్లి చేసింది. అయితే ఈ క్రమంలోనే మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికకు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.
తమ ఇద్దరి ప్రయాణం, పెళ్లికి సంబంధించిన దృశ్యాలతో ఓ స్పెషల్ సాంగ్ చేయించుకొని మౌనికకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. డెడికేటెడ్ టు మౌనిక అంటూ యూట్యూబ్ వేదికగా ఆ పాటను విడుదల చేశాడు. అయితే అందులో మంచు మనోజ్, ఆయన కుటుంబ సభ్యులు, మౌనిక ఫ్యామిలీ పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలు అందులో ఉన్నాయి. యేం మనసో యేం మనసో.. యేం వరసో, యేం వరసో అంటూ సాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది.
ముందుగా మౌనిక, మనోజ్ ఫొటోలతో ఈ వీడియో ప్రారంభం కాగా ఆ తర్వాత హల్దీ, మెహందీ ఫంక్షన్స్, ఆ తర్వాత పెళ్లి అన్నింటికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే విజ్యువల్స్ తో పాటు పాట కూడా అదిరిపోయింది.
అయితే అద్భుతమైన పాటను అనంత్ శ్రీరామ్ రాయగా... అచ్చు రాజమణి మ్యూజిక్ డైరెక్ట్ చేసి మరీ పాడారు. అలాగే రంగ్ దే ఫొటోగ్రఫీ సినిమాటోగ్రపీ పనులు చూసుకోగా.. కింతడ అనిల్ కుమార్ ఎడిటర్ గా పని చేశారు.
లార్డ్ శివ దర్శకత్వం వహిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు. అలాగే వీడియో చివరన అంతా శివుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చారు. అంటే వీరి ప్రేమ, పెళ్లి అంతా శివుడి ఆజ్ఞతోనే జరిగిందన్నట్లు వివరించారు. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ మనోజ్, మౌనికలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కలకాలం ఇలాగే సంతోషంగా జీవించండి అంటూ దీవిస్తున్నారు.
ఏది ఏమైనా మీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆ శివుడి దయ వల్ల నిండు నూరేళ్లు చల్లగా ఉండమని కొందరు, ఫైనల్లీ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం అదిరిపోయిన ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా ఓసారి చూసేయండి.