Begin typing your search above and press return to search.

జూలై 8న యాత్ర టీజ‌ర్....పోస్ట‌ర్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   5 July 2018 4:54 PM GMT
జూలై 8న యాత్ర టీజ‌ర్....పోస్ట‌ర్ వైర‌ల్!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బ‌యోపిక్ ల హవా న‌డుస్తోంది.` మ‌హాన‌టి ` ఇచ్చిన కిక్ తో మ‌రిన్ని బ‌యోపిక్ లు ప‌ట్టాలెక్కాయి. ముఖ్యంగా విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న‌ `ఎన్టీఆర్ ` బ‌యోపిక్, ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, మ‌హానేన‌ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న `యాత్ర` బ‌యోపిక్ ల పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. జ‌న‌నేత వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి న‌టిస్తుండ‌డంతో `యాత్ర‌`పై ఆ అంచనాలు మ‌రింత పెరిగాయి. ఈ నేప‌థ్యంలోనే అంద‌రూ ఎంత‌గానో ఎదురు చూస్తోన్న‌‘యాత్ర’ టీజ‌ర్ ను జులై 8న విడుదల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దివంగ‌త నేత వైఎస్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. టీజ‌ర్ కు సంబంధించిన పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఆ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

‘యాత్ర’ టీజర్ ను జులై 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నేడు ప్రకటించారు. వై.ఎస్ జ‌న్మించిన స‌మ‌యానికి (జులై 8 అర్ధరాత్రి 00:00:01) టీజర్ ను విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించారు. ఆ విష‌యాన్ని తెలియ‌జేస్తూ టీజ‌ర్ పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. ప్ర‌స్తుతం ఆ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ బ‌యోపిక్ ను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దివంగ‌త నేత వైఎస్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను పూర్తిచేయనున్న సంగ‌తి తెలిసిందే.