Begin typing your search above and press return to search.

య‌శోద ప్రీమియ‌ర్.. అమెరికాలో టాక్ ఇదీ

By:  Tupaki Desk   |   11 Nov 2022 4:01 AM GMT
య‌శోద ప్రీమియ‌ర్.. అమెరికాలో టాక్ ఇదీ
X
నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల‌తో స‌మంత అద్భుత ఫ‌లితాల‌ను సాధించే ప‌ట్టుద‌ల‌తో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఓబేబి త‌ర్వాత తెలుగులో ఈ భామ మ‌రోసారి నాయికా ప్ర‌ధాన పాత్ర‌తో మెప్పించేందుకు బ‌రిలో దిగింది. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగానే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ య‌శోద‌లో న‌టించింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో థ్రిల్లింగ్ మోడ్ లో సాగే ఈ సినిమాలో సరోగ‌సి (అద్దె గ‌ర్భం) ఎలిమెంట్ రిలీజ్ ముందే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన య‌శోద గురించి టాక్ ఎలా ఉంది? అన్న‌ది ప‌రిశీలిస్తే అమెరికా నుంచి అందిన రిపోర్ట్ ఇదీ.

యశోద షో రేప్ మర్డర్ మిస్టరీతో మొదల‌వుతుంది. సరోగసీని పరిచయం చేస్తూ సామ్ చాలా సాధారణంగా ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇస్తుంది. కథ సరోగసి ... హత్య విచారణ నేప‌థ్యంలో ముందుకు సాగుతుంది. అయితే ద్వితీయార్థంలో చివరి ఊహాజనిత ట్విస్ట్ తర్వాత రొటీన్ యాక్షన్ డ్రామాగా య‌శోద సాగుతుంది.

సమంత యాక్షన్ ఎమోషన్ తో బాగానే ఆక‌ట్టుకున్నా కానీ చివ‌రికి యశోద ఓకే వాచ్ అనిపిస్తుంది. యశోద ద్వితీయార్థం మధు (వరలక్ష్మి శరత్‌కుమార్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ప్రారంభించ‌డం ఆక‌ట్టుకుంటుంది.

ఇక ప్ర‌థ‌మార్థం ప‌రిశీలిస్తే... క‌థ ఫ్లాట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి ముందు చివరి ఇరవై నిమిషాల వరకు యశోద ప్ర‌థ‌మార్థం చాలా వరకు సాధాసీదాగా సాగుతుంది. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా థ్రిల్లర్ మోడ్ లోకి మారుతుంది. ద్వితీయార్థంలో ఏం జ‌రుగుతుందో చూడాల‌న్న ఉత్కంఠ‌ను ఇంట‌ర్వెల్ బ్లాక్ లో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. అయితే ద్వితీయార్థంలో ఆశించినంత టింజ్ క‌నిపించ‌దు. స‌రోగ‌సి నేప‌థ్యం అన‌గానే ఇంకేదైనా కొత్త‌గా చూపిస్తారా? అనుకుంటే... ఇది కూడా ఒక సాధార‌ణ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ల జాబితాలో చేరిపోయింది.

ఇందులో సమంత- వరలక్ష్మి శరత్‌కుమార్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఉన్ని ముకుందన్- రావు రమేష్- మురళీ శర్మ- సంపత్ రాజ్ ఎవ‌రి పాత్ర‌ల్లో వారు మెప్పిస్తారు. మ‌ణిశ‌ర్మ‌ సంగీతం ఓకే. ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ- డా. చల్లా భాగ్యలక్ష్మి సంభాష‌ణ‌లు ప్ల‌స్. రామజోగయ్య చంద్రబోస్ శాస్త్రి.. చంద్ర‌బోస్ సాహిత్యం ఆక‌ట్టుకుంటుంది.

శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కెమెరా: ఎం. సుకుమార్.. ఆర్ట్: అశోక్.. ఫైట్స్: వెంకట్.. ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్ దర్శకత్వం: హరి - హరీష్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.