Begin typing your search above and press return to search.

యష్ కోరిక.. అతనితో నటించాలని ఉందట!

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:19 AM GMT
యష్ కోరిక.. అతనితో నటించాలని ఉందట!
X
ఫ్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును అందుకోవడమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన పవర్ఫుల్ హీరో నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్షన్ ప్రియులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేజిఎఫ్ సినిమా సక్సెస్ కావడంతో ఆ తర్వాత చాప్టర్ 2 కూడా అంతకు మించి సక్సెస్ కావడంతో అతని రేంజ్ ఊహలకందని స్థాయికి పెరిగిపోయింది.

బాహుబలి రేంజ్ లో 1000 కోట్లకు పైగా మార్కెట్ పెరగడంతో తప్పకుండా అంతకుమించి అనేలా ఉండాలి అనేది యష్ అభిమానుల నుంచి ఒక బలమైన డిమాండ్ అయితే ఏర్పడుతున్నట్లుగా అర్థమవుతుంది.

కాబట్టి యష్ ఎవరితో వర్క్ చేస్తాడు ఎలాంటి సినిమా చేస్తాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. నిరంతరంగా తనకు తెలిసిన దర్శకల నుంచి కథలు వింటున్నాడట. అలాగే బాలీవుడ్ కోలీవుడ్ నుంచి కూడా కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ తో దర్శకులు వస్తున్నారట. కానీ ఇంకా ఈ హీరో ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని తెలుస్తోంది. ఒక కన్నడ దర్శకుడు తోనే మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఆ మధ్య కథనాలు వెలువడ్డాయి.

ఆ సంగతి అటు ఉంచితే ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన యష్ తన కెరీర్ లో ఒక నటుడుతో మాత్రం తప్పనిసరిగా నటించాలి అని అనుకుంటున్నట్లు తెలియజేశాడు. మీకు ఎక్కువగా ఎవరితో నటించాలని ఉంది అనే ప్రశ్నకు ఊహించిన విధంగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజ్ సిద్దిఖీతో యాక్ట్ చేయాలని ఉంది అని ఆయన చాలా మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటూ ఆయన హవ భావాలతోనే సన్నివేశం మొత్తాన్ని తెరపై హైలెట్ చేయగలరు అని తనదైన శైలిలో నవాజ్ సిద్ధికి గురించి వివరణ ఇచ్చాడు.

కేజీఎఫ్ లాంటి సక్సెస్ అందుకున్న తర్వాత ఆ ఆ తరహా నటుడి గురించి యష్ వివరణ ఇవ్వడం గొప్ప విషయమే అని చెప్పాలి. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో నటించాలని ఉంది అని కూడా ఈ నటుడు వివరణ ఇచ్చిన విధానం నెటిజన్స్ ను ఎంతగానో కట్టుకుంటుంది.

ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 సక్సెస్ కావడంతో మూడో చాప్టర్ కూడా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తెరపైకి రావాలి అంటే దర్శకుడు ప్రశాంత్ ప్రభాస్ ఎన్టీఆర్ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది.