Begin typing your search above and press return to search.

శంకర్‌.. మణిరత్నంల లో యశ్‌ ఛాయిన్‌ ఎవరు?

By:  Tupaki Desk   |   20 Dec 2019 7:48 AM GMT
శంకర్‌.. మణిరత్నంల లో యశ్‌ ఛాయిన్‌ ఎవరు?
X
సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోల్లో బాలీవుడ్‌ సినీ వర్గాల వారి దృష్టిని ఆకర్షిస్తున్న హీరోలు తెలుగు నుండి ప్రభాస్‌ మరియు కన్నడ నుండి యశ్‌. వీరిద్దరు కూడా బాలీవుడ్‌ రేంజ్‌ లో స్టార్‌ డం ను కలిగి ఉన్నారు. పాన్‌ ఇండియా మార్కెట్‌ ను కలిగి ఉన్న వీరిద్దరు కూడా ఎప్పుడు జాతీయ మీడియాలో ఏదో ఒక విషయమై ఉంటూనే ఉన్నారు. ఇటీవల బిహైండ్‌ హుడ్స్‌ గోల్డ్‌ మెడల్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న యశ్‌ చాలా స్టైలిష్‌ లుక్‌ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

బాలీవుడ్‌ స్టార్స్‌ కు సరి పోటీగా యశ్‌ స్టైలిష్‌ లుక్‌ తో హిందీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల జరిగిన బిహైండ్‌ హుడ్స్‌ గోల్డ్‌ మెడల్స్‌ కార్యక్రమంలో అవార్డు అందుకున్న యశ్‌ స్టేజ్‌ పై మాట్లాడుతూ చాలా తెలివైన వాడు అనిపించుకున్నాడు. సౌత్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ మణిరత్నం మరియు శంకర్‌ లలో మీరు ఎవరితో సినిమా చేస్తారంటూ ప్రశ్నించగా వెంటనే శంకర్‌ దర్శకత్వంలో చేయాలనేది తన కోరిక అంటూ చెప్పుకొచ్చాడు.

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా ఆల్‌ ఇండియా స్టార్‌ అయిన యశ్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రంను చేస్తున్నాడు. కన్నడ సినీ చరిత్రం లో మరపురాని రికార్డుల ను దక్కించుకున్న కేజీఎఫ్‌ చిత్రం కొనసాగింపు గా రాబోతున్న కేజీఎఫ్‌ 2 చిత్రం కూడా సెన్షేషనల్‌ సక్సెస్‌ అవ్వడం ఖాయం అంటున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి పార్ట్‌ కు మించి ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.