Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ హీరో హ‌త్య‌కు కుట్ర‌?

By:  Tupaki Desk   |   10 March 2019 10:53 AM IST
కేజీఎఫ్ హీరో హ‌త్య‌కు కుట్ర‌?
X
`కేజీఎఫ్‌` సినిమాతో ఒక్క‌సారిగా క‌న్న‌డ సినిమా స్థాయిని ప్ర‌పంచ స‌నీ య‌వ‌నిక‌పై నిల‌బెట్టిన హీరో య‌ష్‌. ఈ సినిమా క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు ద‌క్షిణాది సినిమాకు తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క‌సారిగా ప్ర‌పంచ సినిమా ద‌క్షిణాది వైపు ఆశ్చ‌ర్యంతో తొంగి చూసేలా `బాహుబ‌లి` చేస్తే హాలీవుడ్ సినిమాని ఇండియాలోనూ చేస్తామ‌ని `కేజీఎఫ్‌` నిరూపించి హాలీవుడ్ టెక్నీషియ‌న్‌ ల‌నే నివ్వెర పోయేలా చేసింది. దీంతో య‌ష్ క్రేజ్ తారా స్థాయికి చేరింది. అయితే ఆ క్రేజ్‌ని త‌ట్టుకోలేని వాళ్లు అత‌న్ని ఎలాగైనా అంతం చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు క‌న్న‌డ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చారం కావ‌డం తీవ్ర సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

య‌ష్‌ ని హ‌త్య చేయించ‌డం కోసం కొంద‌రు శ‌త్రువులు ఓ పేరు మోసిన గ్యాంగ్‌ కు భారీ మొత్తంలో సుపారీ ఇచ్చార‌ని వార్త‌లు రావ‌డం స‌ర్వ‌త్రా సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని హీరో రాక్‌ స్టార్ య‌ష్ క్లారిటీ ఇచ్చారు. మీడియా అతిని త‌గ్గించుకోవాల‌ని - ఏది నిజ‌మో ఏది అబ‌ద్ధ‌మో తెలుసుకుని ప్ర‌చారం చేయాల‌ని య‌ష్ క‌న్న‌డ మీడియాపై నిప్పులు చెరిగారు. త‌నంటే ఎవ‌రికీ ద్వేషం లేద‌ని - న‌న్ను హ‌త్య చేయాల్సిన అవ‌స‌రం కూడా ఎవ‌రికి లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై సీసీబీ అడిష‌న‌ల్ క‌మీష‌న‌ర్ అలోక్ కుమార్‌ తో మాట్లాడిన‌ట్టు తెలిపారు.

క‌ర్ణాట‌క హోమ్ మినిస్ట‌ర్ ఎంబీ పాటిల్‌ ని కూడా ఈ అస‌త్య ప్ర‌చ‌రంపై క‌లిసి య‌ష్ చ‌ర్చించ‌డంతో ఆయ‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ మీడియాలోనూ య‌ష్ ని హ‌త్య చేయ‌బోతున్నార‌ని వార్తా క‌థ‌నాలు ప్ర‌సారం కావ‌డం దేశ వ్యాప్తంగా య‌ష్ అభిమానుల్లో క‌ల‌క‌లం రేపింది.య‌ష్ ఈ ఇష‌యంపై మీడియా సంయ‌మ‌నం పాటించి నిజానిజాలు తెలుసుకుని ప్ర‌చారం చేయాల‌ని మండిప‌డ‌టంతో వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని క‌న్న‌డ చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. య‌ష్ న‌టిస్తున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` వ‌చ్చే నెల ప్రారంభం కాబోతోంది. ఇందులో ప్ర‌తీదీ స‌ర్‌ ప్రైజింగానే వుంటుంద‌ని క‌న్న‌డ మీడియా టాక్‌.