Begin typing your search above and press return to search.
సాటి హీరో కుళ్లుకునేలా చేసిన ట్యాలెంటెడ్ హీరో!
By: Tupaki Desk | 22 April 2020 1:00 AM ISTరాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ స్టార్ గా ప్రపంచానికి సుపరిచితం. ఒక డ్రైవర్ కొడుకు పాన్ ఇండియా హీరోగా సత్తా చాటాడు! అంటూ సాగిన ప్రచారం గురించి తెలిసిందే. సాక్షాత్తూ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆ విషయాన్ని `కేజీఎఫ్- చాప్టర్ 1` తెలుగు ప్రమోషన్స్ లో హైలైట్ చేయడంతో యష్ కి ఇక్కడా ఫ్యాన్స్ పెరిగారు. ఆ తర్వాత యష్ గురించి చాలా విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మనవాళ్లకు యష్ గురించి తెలిసింది చాలా తక్కువే. అతడు ఒక సాధారణ నటుడిగా ప్రారంభమై అసాధారణంగా ఎదిగిన సగటు యువకుడు. ఇక యష్ ట్యాలెంట్ డామినేషన్ వల్ల ఒకానొక సందర్భంలో ఓ కన్నడ హీరో చిన్న బుచ్చుకునేంత వరకూ వెల్లింది. ఆ ఘటన వివరాల్లోకి వెళితే...
కన్నడ బెస్ట్ డ్యాన్సింగ్ హీరోల జాబితా తిరగేస్తే యష్ పేరు ఆ చార్ట్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. నిస్సందేహంగా శాండల్‌వుడ్ లోని ఉత్తమ డ్యాన్సర్లలో యష్ ఒకరు. ఆ విషయాన్ని అభిమానులే కాదు సగటు జనం అంగీకరిస్తారు. ఆ సంగతి `చంద్ర` సినిమా సమయంలో బయటపడింది. ఆ సినిమాలో శ్రీయతో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించిన యష్ అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇక చంద్ర దర్శకనిర్మాతలు యష్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి తెలిసి ఆ ప్రత్యేక గీతాన్ని రూపొందించే ప్లాన్ చేశారు.
అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఆ మూవీ హీరో ప్రేమ్ తో దర్శకనిర్మాతలకు గొడవ మొదలైంది. యష్ డామినేషన్ ని సహించలేని ప్రేమ్ దర్శకురాలు రూప అయ్యర్ తో గొడవ పడ్డాడు. చంద్ర మేకింగ్ సమయంలో రూప అయ్యర్ తో ప్రేమ్ తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. అయినా యూత్ లో యష్ కి ఉన్న ఆదరణ దృష్ట్యా చివరికి ఆ ప్రత్యేక గీతానికి ప్రేమ్ కూడా అంగీకరించాడట. ఇక ఆ పాట చిత్రీకరణ అనంతరం యష్ గొప్ప డ్యాన్సర్ అంటూ అప్పటికే టాప్ లేపే డ్యాన్సర్ గా పేరున్న శ్రీయ వేదికలపై తెగ పొగిడేసింది. శ్రీయ ప్రశంసల పుణ్యమా అని ఆ పాట ప్రజాదరణ పొందింది. మేకర్స్ యాష్ అభిమానులను ఆకర్షించడానికి పోస్టర్లను వేసారు. అయితే దురదృష్టవశాత్తు... అప్పటికే హీరో డైరెక్టర్ మధ్య వివాదం చినికి చినికి గాలి వానైంది. అనంతరం హీరోని దర్శకురాలు కావాలనే ప్రమోషన్స్ కి రానివ్వకుండా పక్కన పెట్టేయడం పెను వివాదానికి కారణమైంది.
ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ తో తన గొడవ ఏమిటో దర్శకురాలు రూప అయ్యర్ తెలిపారు. ఆ చిత్రంలో యష్ తో ప్రత్యేక గీతం రూపొందించడం ప్రేమ్ ని డిఫెన్స్ లో పడేసిందని టీవీ చానెల్ లైవ్ లో రూప అయ్యర్ చెప్పడంతో అగ్గి రాజుకుంది. అయితే ఆ తరువాత ఒకానొక ఇంటర్వ్యూలో ప్రేమ్ తనకు కేజీఎఫ్ స్టార్ తో ఎలాంటి సమస్యా లేదని.. రూపా అయ్యర్ అహాన్ని పక్కన పెట్టి తనను ప్రమోషన్లకు ఆహ్వానిస్తే హాజరవుతానని చెప్పాడు. ఆ తర్వాత ఆ వివాదాన్ని క్రేజీ స్టార్ రవిచంద్రన్ పరిష్కరించారు. హీరోకి తగిన గౌరవం ఇవ్వమని దర్శకురాలికి సలహా ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తరువాత `చంద్ర` విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. ప్రేమ్ కి బ్యాడ్ నేమ్ వచ్చింది. చివరికి యష్ - శ్రియ శరణ్ పాట ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. అలా సాటి హీరో అసూయకు.. ఇన్ సెక్యూర్ ఫీలయ్యేందుకు కారణమయ్యాడు యష్. అదంతా తనకు తెలియకుండానే అలా జరిగిపోయింది అంతే!