Begin typing your search above and press return to search.

'ధూమ్ 4' లో SRK 2.0 రీలోడెడ్!

By:  Tupaki Desk   |   2 Jun 2019 1:30 AM GMT
ధూమ్ 4 లో SRK 2.0 రీలోడెడ్!
X
కింగ్ ఖాన్ షారూక్ 2.0 లా రీబూట్ కాబోతున్నాడా? ఒక స్టార్ గా త‌న‌ ప్ర‌భ మ‌స‌క‌బారుతున్న వేళ అత‌డి ఖాతాలో ధూమ్ 4 లాంటి క్రేజీ సినిమా ప‌డ‌నుందా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. కింగ్ ఖాన్ షారూక్ వ‌రుస ప‌రాజ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అత‌డు న‌టించిన ఫ్యాన్- జ‌బ్ హ్యారీ మెట్ సీజ‌ల్- జీరో చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో అత‌డి మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యింది. కార్పొరెట్ బ్రాండ్లు సైతం బాద్ షాకి ముఖం చాటేస్తున్నాయి. అందుకే ఇప్పుడు త‌న మార్కెట్ ని తిరిగి రీబూట్ చేసే ప‌నిలో ఉన్నాడు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌ఖ్యాత య‌శ్ రాజ్ ఫిలింస్ నుంచి షారూక్ కి అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఈ సంస్థ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ధూమ్ సిరీస్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఆ క్ర‌మంలోనే ధూమ్ 4 చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌ద‌రు బ్యాన‌ర్ స‌న్నాహ‌కాల్లో ఉంది. నాలుగో భాగంలో షారూక్ ని న‌టింప‌జేసేందుకు ప్లాన్ లో ఉంద‌ట‌. బాద్ షాని ఒప్పించే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌తిష్ఠాత్మ‌క ధూమ్ సిరీస్ లో ధూమ్ -1లో జాన్ సింహ‌బ‌లుడు అబ్ర‌హాం విల‌న్ గా న‌టించాడు. `ధూమ్ 2`లో హృతిక్ రోష‌న్ ప్ర‌తినాయ‌క చాయ‌లున్న పాత్ర‌లో మెప్పించాడు. ఆ త‌ర్వాత `ధూమ్ 3`లో మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విల‌న్ పాత్ర పోషించారు. ఇవ‌న్నీ గ్రాండ్ స‌క్సెస్. అందుకే ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ నాలుగో సినిమాలో షారూక్ న‌టిస్తారు అన్న‌ది ఎగ్జ‌యిటింగ్ పాయింట్. ఇక జీరో సినిమా ఫ్లాప్ అయ్యాక షారూక్ పూర్తిగా డీలా ప‌డిపోయాడు. ఆ వెంట‌నే చేయాల్సిన రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్ `సారే జ‌హాసే అచ్చా` నుంచి డ్రాప‌య్యాడు. ఆ క్ర‌మంలోనే డాన్ సీక్వెల్ లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లొచ్చాయి. కానీ అది ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టాలెక్క‌లేదు. అందుకే ఇప్పుడు `ధూమ్ 4` ఆప్ష‌న్ స‌రైన‌దేన‌న్న మాటా వినిపిస్తోంది. ఇది అభిమానుల‌కు ఇది శుభ‌వార్త‌నే. అయితే య‌శ్ రాజ్ సంస్థ నుంచి అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. మ‌రోవైపు షారూక్ ఇటీవ‌ల‌ న‌ట‌న వైపు కంటే నిర్మాణం వైపు ఎక్కువ దృష్టి సారించాడు. షారూక్‌ రెడ్ చిల్లీస్ సంస్థ నుంచి డిజిట‌ల్ కంటెంట్ రూప‌క‌ల్ప‌న‌లో త‌ల‌మున‌క‌లుగా ఉన్నాడు.