Begin typing your search above and press return to search.

చోటా చిత్రాలను చేయనంటున్నపెద్ద నిర్మాణ సంస్థ

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:12 AM GMT
చోటా చిత్రాలను చేయనంటున్నపెద్ద నిర్మాణ సంస్థ
X
యష్ రాజ్ ఫిలిమ్స్... బాలీవుడ్ లోనేకాదు ఎన్ని వుడ్ లలోనైనా ఈ సంస్థ పేరు తెలియని సినీ అభిమాని వుండరు. ముంబాయి మహానగరంలో ఒక చిన్న నిర్మాణ సంస్థగా మొదలైన వీరి ప్రస్థానం బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ లకు, ఆల్ టైం క్లాసిక్స్ కి, ఎవర్గ్రీన్ సినిమాలకు నిలయమైంది. కేవలం నిర్మాణ సంస్థతోనే ఆగక మ్యూజిక్ ఛానల్, టెలివిజన్ మాధ్యమాలలో సైతం తన ప్రతిభను నిరువుపించుకుంది.

దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, ధూమ్ సిరీస్ వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన ఈ సినిమా మన యువహీరో నాని నటించిన 'ఆహా కళ్యాణం' సినిమాతో టాలీవుడ్ లోకి సైతం అడుగుపెట్టింది. అయితే ఈ బడా కంపనీ ఇప్పుడొక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది.

ఇకపై తాము కేవలం పెద్ద చిత్రాలను మాత్రమే నిర్మిస్తామని, చిన్న సినిమాల జోలికిపోమని తెలిపింది. ఇటీవల తాము నిర్మించిన కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు ఘోరపరాజయం కావడమే దీనికి కారణమని సమాచారం. ప్రస్తుతం షారుఖ్, సల్మాన్, హృతిక్ ల సినిమాలు ఈ సంస్థనుండి నిర్మాణమవుతున్నాయి. దాదాపు 70సినిమాల చరిత్ర వున్న సంస్థ కీర్తిని తగ్గించకూడదు అనే భావనతో ఈ డెసిషన్ కి వచ్చినట్టు తెలుస్తుంది.