Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ హీరో యశ్ తల్లికి.. గ్రామస్తులకు మధ్య వివాదం ఏమిటి?
By: Tupaki Desk | 10 March 2021 11:00 AM ISTగతంలో చేసిన సినిమాలు తీసుకురాలేని ఇమేజ్ ను కేజీఎఫ్ ఒక్కదాంతో హాట్ స్టార్ గా మారిపోయారు కన్నడ మీరో యశ్. బ్లాక్ బస్టర్ మూవీతో అందరికి సుపరిచితమైన యశ్.. ప్రస్తుతం కేజీఎఫ్ 2 పార్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన కుటుంబానికి.. హాసన్ లోని రైతుల మధ్య గొడవ ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది. యశ్ తల్లి తీరుపై అక్కడి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? అసలీ గొడవ ఎలా మొదలైందన్నది చూస్తే..
యశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన వారు. హాసన్ లో ఆమెకు సొంత ఇల్లు కూడా ఉంది. హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల వారి కుటుంబం 80 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. తాము కొనుగోలు చేసిన 80 ఎకరాల పొలాలకు సంబంధించిన దారిని మూసేయటం వివాదానికి కారణమైంది.
ఏళ్లకు ఏళ్లుగా సాగు చేస్తున్న తమకు.. తమ పొలాల్లోకి వెళ్లకుండా దారి మూసేయటంపై తిమ్మాపుర గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ముదిరి.. తాజాగా యశ్ తల్లి పుష్పలతతో వారు గొడవ పడ్డారు. వివాదం కొలిక్కి రాకపోవటంతో గ్రామస్తులు దుద్ద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్చేశారు. యశ్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 80 ఎకరాల భూమికి కంచెవేస్తే.. తమ పొలాల్లోకి వెళ్లేందుకు కష్టమని వారు వాపోతున్నారు.
ఈ వివాదం సంగతి తేల్చేందుకు యశ్ స్వయంగా తిమ్మాపురకు వచ్చారు. ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు పిలిచి.. పంచాయితీ నిర్వహించారు. రైతుల ఆందోళనపై యశ్ ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. యశ్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తిమ్మాపురకు చేరుకున్నారు. మరోవైపు.. యశ్ కుటుంబం నిర్మించిన కంచె తొలగించే వరకు ఆందోళన నిర్వహిస్తూనే ఉంటామని చెబుతున్నారు. మరీ కేజీఎఫ్ హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.