Begin typing your search above and press return to search.

యశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. అభిమానులెవరూ రావొద్దన్న హీరో

By:  Tupaki Desk   |   5 Jan 2021 4:03 PM GMT
యశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. అభిమానులెవరూ రావొద్దన్న హీరో
X
‘కేజీఎఫ్..’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యశ్. 2018లో విడుదలైన ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పార్ట్-2 కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా.. త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్2 టీజర్ రిలీజవుతోంది. దీనికోసం అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా.. జనవరి 8వ తేదీన యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ అవుతోంది. ఈ విధంగా.. ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా ట్రీట్ ఇవ్వబోతున్నాడు హీరో. ఈ నేపథ్యంలో యశ్ ఓ చిన్న వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. తన బర్త్ డేను టీజర్ తో సెలబ్రేట్ చేసుకోవాలన్న హీరో.. దూర ప్రాంతాల నుండి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు.

గతేడాది తన పుట్టినరోజు కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది అభిమానులు వచ్చారని గుర్తు చేసుకున్నాడు యశ్. అయితే.. ఈ సారి కరోనా నేపథ్యంలో జర్నీ చేయడం.. తన వద్దకు రావడం సురక్షితం కాదని చెప్పాడు. తనకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నవారు సోషల్ మీడియాలోనే చెప్పాలని కోరాడు. తన నివాసానికి మాత్రం ఎవ్వరూ రావొద్దని కోరాడు. కాగా.. బర్త్ డే రోజున యశ్ చేయబోయే ట్వీట్ ను ఎవరు రీట్వీట్ చేసినా.. పర్సనల్ రిమైండర్ వచ్చేలా ఏర్పాాట్లు చేసింది ప్రొడక్షన్ హౌజ్.