Begin typing your search above and press return to search.
నాలుగేళ్ల తర్వాత వైఫ్ తో రాఖీ భాయ్.. సందడే సందడి
By: Tupaki Desk | 19 Dec 2020 11:15 AM IST‘కేజీఎఫ్’ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు శాండల్‌వుడ్ హీరో యశ్. ఈ చిత్రంతో.. ‘రాఖీ భాయ్’గా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఫుల్ క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం కేజీఎఫ్-2 షూటింగ్ హైదరాబాద్ లో వేసిన భారీ బంగారు గనుల సెట్లో శరవేగంగా కొనసాగుతోంది.
కాగా.. యశ్ వైఫ్ రాధికా పండిట్ సైతం అద్భుతమైన నటి. గతంలో వీరిద్దరూ కలిసి నటించారు కూడా. నాలుగేళ్ల క్రితం కన్నడ చిత్రం ‘సంతు స్ట్రెయిట్‌ఫార్వర్డ్’లో తెరపై మెరిసింది ఈ కపుల్. ఆ తర్వాత రాధిక ఇద్దరు పిల్లల తల్లిగా గృహిణి పాత్రలో బిజీ కాగా.. తనను తాను పాన్-ఇండియా స్టార్‌గా మార్చుకున్నాడు యశ్. కట్ చేస్తే.. లేటెస్ట్ గా మరోసాారి వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇటీవల ఓ ఆయిల్ బ్రాండ్ కోసం చిత్రీకరించిన యాడ్ ఫిల్మ్ లో ఈ స్టార్ కపుల్ కలిసి నటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు రాధికా పండిట్. ఈ యాడ్ షూట్ కు సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రాధికా.. “4 సంవత్సరాల తరువాత, మీకు ఇష్టమైన సహ నటుడితో పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఈ షూట్ ను మేము ఎంత ఆనందించామో.. మీరు కూడా అంతగా ఆనందిస్తారు’’ అని కోట్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.