Begin typing your search above and press return to search.

హలో ఫంక్షన్ తో టాలీవుడ్ వచ్చినట్టా?

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:41 AM GMT
హలో ఫంక్షన్ తో టాలీవుడ్ వచ్చినట్టా?
X
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమా ఫంక్షన్స్ ఏపీలో కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. గతంలో దాదాపు అన్ని ఈవెంట్స్ హైద్రాబాద్ లోనే ఉండగా.. ఇప్పుడు సినిమా వేడుకల విషయంలో అటొకటి.. ఇటొకటి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఇండస్ట్రీ జనాలు జాగ్రత్త పడుతున్నారు.

హలో ఆడియో లాంఛ్ ఈవెంట్ విశాఖలో జరగగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.. విశాఖ గొప్పదనం గురించి చాలానే చెప్పారు. 'చెన్నై మెరీనా బీచ్ నుంచి హైద్రాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డుకు తెలుగు సినిమాను తరలించిన చరిత్ర ఏఎన్నాఆర్ ది. ఇప్పుడు హలో చిత్రం ద్వారా టాలీవుడ్ విశాఖ బీచ్ ఒడ్డుకు చేరుకుంటోంది' అన్నారు లక్ష్మీ ప్రసాద్. అంతా బాగానే ఉంది కానీ.. ఈయన స్పీచ్ వింటుంటే.. అదేదో టాలీవుడ్ పార్టు 2.. వైజాగ్ లో ఆవిష్కరించారు అనే రేంజ్ లో ఉండడం ఆశ్చర్యకరం.

మరి.. టాలీవుడ్ టు వైజాగ్ అన్నది నిజమేనా అంటే ఆలోచించాల్సిందే. అఖిల్ 'హలో' ఈవెంటుతో అక్కడ మరో టాలీవుడ్ మొదలైనట్లు అనుకోవడం కష్టమే. అసలు ఈ ప్రస్తావన లేనప్పుడే చాలానే షూటింగ్స్ వైజాగ్ లో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. అలాగే చాలా సినిమాల ప్రోగ్రాములే ఇక్కడ జరిగాయ్. మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే.. దగ్గరుండి మరీ మెగా ఫ్యామిలీతో చాలా ఈవెంట్స్ జరిపించారు. అప్పుడెప్పుడూ తరలివెళ్లని టాలీవుడ్ ఇప్పుడు హలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ తో విశాఖకు వెళ్లిపోయిందని అనుకోవడం ఎలాగో అర్ధం కాని విషయమే.