Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : యామినీ.. ఈ ఫోజులు దేనికి...?
By: Tupaki Desk | 2 May 2020 11:30 AM ISTయామిని భాస్కర్... ‘కీచక’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి. విజయవాడకి చెందిన పదహారణాల తెలుగమ్మాయి. చేసింది తక్కువ సినిమాలే.. అందులోనూ అన్నీ ఫ్లాపులే. అరడజను సినిమాల్లో నటించినా ఈ అమ్మడి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కూడా ఒకటి ఉంది. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'రభస' సినిమాలో ఈమె కూడా నటించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'కాటమరాయుడు'లో కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో యామిని గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. ఇక ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన 'నర్తనశాల' సినిమాలో సత్యభామగా బికినీ కూడా వేసి ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. అదీ ఫ్లాప్ కావడం ఈమెకు మైనస్ అయిపోయింది. ‘భలే మంచి చౌక బేరమ్’ చిత్రంతో యామిని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఏం లాభం ఆ సినిమా ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. దాంతో అన్ని దారులు మూసుకుపోవడంతో ఇప్పుడు అందాల దారులు ఓపెన్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ వేడి పుట్టించే ఫోటోలను అప్లోడ్ చేస్తూ దర్శక నిర్మాతలకు గాలం వేస్తూ ఉంటుంది. ఇంతకముందు బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో అమ్మడు ఒలకబోసిన అందాల ఆరబోత చూసి అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు లాక్ డౌన్ టైములో ఇంటికే పరిమితమైన మన యామిని భాస్కర్ మరో ఫొటోతో కనువిందు చేస్తోంది. అందాలను బెడ్ మీద పరిచి తన చూపులతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. అందరూ సెలబ్రిటీల లాగా ఫోటో షూట్ ఫోటోలు అప్లోడ్ చేయకుండా క్వారంటైన్ లో తన ఇంట్లో తీసుకున్న పిక్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను తన అన్ని యాంగిల్స్ చూపిస్తూ అందాల బాణాలు విసురుతోంది. యామిని ధరించిన లాకెట్ తన ఎద సొంపులను ముద్దాడుతూ ఆమెకు మరింత అలంకరణగా మారింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన తర్వాత కచ్చితంగా ఎవరో ఒక దర్శకుడు అవకాశం ఇవ్వకుండా ఉండలేరేమో. చూద్దాం మన తెలుగమ్మాయి భంగిమలు చూసి ఎంతమంది దర్శకనిర్మాతలు ముందుకు వస్తారో.