Begin typing your search above and press return to search.

పచ్చబొట్టు పొడిపించుకుని పిచ్చెక్కించాడు

By:  Tupaki Desk   |   8 Jun 2015 11:00 PM IST
పచ్చబొట్టు పొడిపించుకుని పిచ్చెక్కించాడు
X
ఫేవరెట్‌ హీరోయిన్‌ కోసం పడిచచ్చే వీరాభిమానులుంటారు. బెడ్‌రూమ్‌లో పోస్టర్లు అతికించుకోవడం నుంచి, నచ్చిన హీరోయిన్‌తో డ్రీమ్స్‌లో డ్యూయెట్లు వేసుకోవడం వరకూ వాళ్ళకు హ్యాబిట్‌. నూనూగు మీసాల వయసులో ఫాంటసీలోకి వెళ్లడం ఆ వయసు ధర్మం కాబట్టి నచ్చిన హీరోయిన్‌ కనబడగానే మీటర్‌ గేజ్‌ మారిపోతుంది.

ఇటీవలే ఓ అభిమాని అదే తీరుగా ప్రవర్తించాడు యామి గౌతమ్‌ విషయంలో. యామి ఏ షూటింగులో పాల్గొంటోందో తెలుసుకుని మరీ అక్కడికి రోజూ వెళ్లిపోయేవాడుట. అంతేనా యామి గౌతమ్‌ అందమైన ఫోటోని పచ్చబొట్టు పొడిపించుకుని తనని ప్రేమిస్తున్నా చూడండి అంటూ చిత్రయూనిట్‌కి కూడా చూపించేవాడుట. ఇతగాడి వాలకం చూసి ఏం చేస్తాడో అని చచ్చేంత భయపడిపోయేదిట యామి. అంతేనా ఇదే పరిస్థితి కొనసాగితే సమస్య ప్రమాదకరంగా మారుతుందని గ్రహించి ఒకానొకరోజు అతగాడిని పక్కకు పిలిచి పూర్తిగా మనోశుద్ధి చేసి పంపించిందిట.

యామికి ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. వేరొక వీరాభిమాని భారీ సైజ్‌ కాన్వాస్‌పై అందాల యామిని చిత్తరువు గీసి మరీ తీసుకొచ్చాడట. ఈ అభిమానానికి ఏడ్వాలో నవ్వాలో తెలియని పరిస్థితి. అభిమానులైతే ఉన్నారు కానీ, అమ్మడికి ఆ రేంజులో సినిమాలు మాత్రం లేనేలేవు. అది ట్విస్ట్‌.