Begin typing your search above and press return to search.

యామీ గ్లామర్ ఇప్పుడెందుకబ్బా!?

By:  Tupaki Desk   |   9 Jan 2018 4:28 AM GMT
యామీ గ్లామర్ ఇప్పుడెందుకబ్బా!?
X
ఉత్తరాది భామ యామీ గౌతమ్ గత పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. బాలీవుడ్ తో పాటు పలు తెలుగు సినిమాలే కాదు.. మరిన్ని భాషల్లో కూడా అదృష్టం పరీక్షించుకుంది. అయినా సరే ఈమెకు దక్కిన 'గౌరవం' ఏమీ లేదు. నువ్విలా అంటూ చేసిన ట్రయల్స్.. కొరియర్ బా్ కళ్యాణ్ మూవీ నిరుత్సాహపరిచాయి. కాబిల్ తో హృతిక్ రోషన్ కూడా యామీకి విజయం అందించలేకపోయాడు.

ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు.. యాక్ట్రెస్ గా పెర్ఫామెన్స్ ట్యాలెంట్ ఉన్నా.. ఈ ఉత్తరాది భామకు కాలం కలిసిరాకపోవడానికి ప్రధాన కారణం.. గ్లామర్ చూపించేందుకు నిరాకరించడమే అంటారు సినీ జనాలు. అడపాదడపా మినహాయిస్తే.. అందాలు చూపించే డ్రెస్సుల్లో ఈమె కనిపించిన దాఖలాలు ఉండవు. అయితే.. ఈ ఏడాది మాత్రం అమ్మడు రూట్ మార్చేసినట్లుగా కనిపిస్తోంది. బీచ్ లోనో.. పూల్ లోనో వేయాల్సిన బికినీతో.. సోఫాపై బజ్జును ఫోటోలకు పోజులు ఇచ్చేసింది. మాగ్జిమ్ మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ లో యామీ అందాలు తళుక్కుమన్నాయి.

యామీ గౌతమ్ ఎక్స్ పోజింగ్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయినా.. కెరీర్ లో బోలెడన్ని అవకాశాలు వచ్చిన టైంలో కాకుండా.. ఇప్పుడు 30ప్లస్ లోకి వస్తున్న టైంలో.. ఎందుకు అందాల ప్రదర్శన రూట్ లోకి వెళుతోందో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. మోడలింగ్ లో ఇప్పటికిప్పుడు ఈమెకు వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా.. సినిమాల్లో అవకాశాలు కావాలంటే ఈ రూట్ తప్పదని అర్ధం చేసుకుందేమో!