Begin typing your search above and press return to search.

ఆ జంట వేడి పుట్టించేది తెరపైనే

By:  Tupaki Desk   |   4 Jun 2016 9:30 AM GMT
ఆ జంట వేడి పుట్టించేది తెరపైనే
X
యామి గౌతమ్ - పుల్కిత్ సామ్రాట్.. ఓ సినిమాలో కలిసి నటించి వీరిద్దరిపై బోలెడన్ని రూమర్స్ ఉన్నాయి. రియల్ లైఫ్ లో తెగ డీప్ గా ప్రేమించేసుకుంటున్నారని.. కలిసి జీవించేస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. గతంలో 'సనమ్ రే' చిత్రంలో కనిపించిన యామి గౌతమ్ - పుల్కిత్ సామ్రాజ్ ల జంట.. ఇప్పుడు 'జునూనియత్' లో మరోసారి కెమిస్ట్రీ పండించబోతున్నారు.

తమ ఆఫ్ స్క్రీన్ ప్రేమపై ఇప్పటివరకూ వీరు స్పందింలేదు కానీ.. జునూనియత్ ప్రమోషన్స్ లో మాత్రం.. వీళ్లకి దీనిపై సమాధానం చెప్పక తప్పలేదు. సినిమాలో కంటెంట్ పై కంటే ఎక్కువగా.. కెమిస్ట్రీపైనే క్వశ్చన్స్ ఎక్కువగా రావడంతో.. చివరకు పెదవి విప్పారు ఈ యంగ్ హీరో హీరోయిన్లు. ' మా మధ్య ఆన్ స్క్రీన్ తప్ప.. ఆఫ్ స్క్రీన్ లో ఏం లేదు. ఇవాల్టి రోజుల్లో మీడియా హౌజ్ లు ఎలా ఉన్నాయంటే.. కాపీ పేస్ట్ చేసేస్తున్నారు. ఒకళ్లు రాస్తే.. మిగతావాళ్లకు అదే పని ఇక. జనాలకు బోర్ కొట్టేసిందని అనుకుంటున్నా' అంటోంది యామి.

మరి నిప్పు లేనిదే పొగరాదుగా అంటే.. 'మేం పుట్టించే ఫైర్ అంతా ఆన్ స్క్రీన్ పైనే' అని చెప్పాడు పుల్కిత్. అయితే సనమ్ రే చిత్రానికి జునూనియత్ సీక్వెల్ అనే ఓ టాక్ ఉంది. దీనిపై నవ్వేసిన వీరిద్దరూ.. సనమ్ రే చిత్రం కంటే ముందే జునూనియత్ కి సైన్ చేశామని.. ఇదో ఆర్మీ వ్యక్తిని ప్రేమించిన అమ్మాయి కథ అంతే.. మేమిద్దరం తప్ప స్టోరీకి సంబంధం ఏం ఉండదని చెప్పారు యామీ గౌతమ్ -పుల్కిత్ సామ్రాట్ లు