Begin typing your search above and press return to search.

చైకు ఇష్టమైన పాన్ ఇండియా స్టార్.. మనోడు కాదట!

By:  Tupaki Desk   |   11 Aug 2022 5:01 AM GMT
చైకు ఇష్టమైన పాన్ ఇండియా స్టార్.. మనోడు కాదట!
X
అక్కినేని యువ హీరో నాగచైతన్య ఇటీవల థాంక్యూ సినిమాతో కెరీర్ మొత్తంలోనే అతిపెద్ద డిజాస్టర్ ను చూడాల్సి వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ప్రస్తుతం ఈ హీరో తన నమ్మకం మొత్తం లాల్ సింగ్ చడ్డా సినిమా పైన పెట్టుకున్నాడు. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.

రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగచైతన్య తన పాత్ర అరగంటనే ఉన్నప్పటికీ కూడా సినిమాలో చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది అని మొత్తం కథ సోల్ కూడా తన క్యారెక్టర్ తోనే కొనసాగుతుంది అని చెప్పడం విశేషం. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే నాగచైతన్య థాంక్యూ డిజాస్టర్ నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది.

ఇక తరచుగా తెలుగులో ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగచైతన్య తనకు ఇష్టమైన ఫ్యాన్ ఇండియా స్టార్ట్ గురించి కూడా తెలియజేశాడు. అయితే అతను తెలుగు స్టార్ పేరు చెప్పకుండా ఇతర ఇండస్ట్రీలోనే హీరో పేరు చెప్పడం హాట్ టాపిక్ మారిపోయింది.

మీకు ఇష్టమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు అని అడగగా చైతన్య మరో ఆలోచన లేకుండా కేజిఎఫ్ సినిమా చూడగానే యష్ ఫ్యాన్ అయిపోయాను అని ముఖ్యంగా కేజీఎఫ్ 2 చూసిన తర్వాత మరింత లైక్ చేశాను అని వివరణ ఇవ్వడం విశేషం.

సాధారణంగా ఒక స్టార్ హీరో మరొక స్టార్ హీరో గురించి చెబితే ఆడియన్స్ లో ఆ ఫోకస్ ఎక్కువగా పడుతుంది. ఇక ఇప్పుడు చైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు ఫ్యాన్ ఇండియా స్టార్లు ఉన్నప్పటికీ కూడా కన్నడ స్టార్ హీరో గురించి చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది.

ఒక విధంగా ఎవరి ఇష్టం వారిది అని కూడా నాగచైతన్య అభిమానులు మరికొందరికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక థాంక్యూ సినిమా రిజల్ట్ పై నాగచైతన్య పెద్దగా బాధపడలేదు అని తెలుస్తోంది యాక్టర్స్ కెరీర్లో ఇలాంటి అపజయాలు కామన్ అని వాటిని చూసి ఆగిపోకూడదు అని నెక్స్ట్ సినిమాలపై మరింత ఫోకస్ పెట్టాలి అని.. చాలా సింపుల్గా థాంక్యూ రిజల్ట్ పై చైతన్య ఒక సమాధానమైతే ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో వెంకట్ ప్రభువు దర్శకత్వంలో ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.