Begin typing your search above and press return to search.

రొమాంటిక్ సాంగ్ లో రెట్టింపు గ్లామర్ షో చేసింది శృతి హాసన్...!

By:  Tupaki Desk   |   21 July 2020 5:00 PM GMT
రొమాంటిక్ సాంగ్ లో రెట్టింపు గ్లామర్ షో చేసింది శృతి హాసన్...!
X
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న శృతి హాసన్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. నిజానికి కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ 'లక్' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అన్ లక్కీ అనిపించుకుంది. అప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు హిట్ అయినా ఎందుకో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయిది. ఇక లాభం లేదనుకొని సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అయినా సరే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలనే కోరిక మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో 'యారా' అనే హిందీ మూవీలో నటించింది శృతి హాసన్. విద్యుత్ జమాల్ - అమిత్ షాద్ - విజయ్ వర్మ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జూలై 30న జీ 5 ఓటీటీలో రిలీజ్ కానుంది. 'ఏ గ్యాంగ్ స్టోరీ' అనే ఫ్రెంచ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి టిగ్మాన్షు ధులియా దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మేకర్స్ ఈ సినిమాని కొన్నాళ్ళు నిలిపేశారు. ఎట్టకేలకు 'యారా' ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శృతి హాసన్ అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'యారా' నుంచి రిలీజైన ప్రమోషనల్ వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమా నుండి విడుదలైన 'బేది' అనే సాంగ్ లో శృతిని చూస్తే ఆడియన్స్ షాక్ అవక మానరు. విద్యుత్ జమాల్ కలిసి ఈ సాంగ్ లో రొమాన్స్ చేసిన శృతి కిస్సింగ్ సీన్స్ లో కూడా నటించేసింది. అంకిత్ తివారి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కాగా ఫస్ట్ సినిమా 'లక్' లో బికినీ ధరించి అందరిని ఆశ్చర్యపరిచిన శృతి స్కిన్ షో ఎల్లప్పుడూ ముందంజ‌లోనే ఉంటూ వ‌చ్చింది. ఎలాగైనా బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న శృతి ఇప్పుడు రెట్టింపు గ్లామర్ షో చేసింది. మరి అమ్మడు రొమాంటిక్ సీన్స్ చూసైనా బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా వస్తాయేమో చూడాలి. ఇక తెలుగులో 'కాటమరాయుడు' సినిమా తర్వాత ఈ భామ చాలా గ్యాప్ తీసుకొని రవితేజ సరసన 'క్రాక్' మరియు పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్' సినిమాల్లో నటిస్తోంది.