Begin typing your search above and press return to search.

WWW పెద్ద హిట్ అవుతుంది : కల్యాణ్ రామ్

By:  Tupaki Desk   |   25 Dec 2020 9:51 AM GMT
WWW పెద్ద హిట్ అవుతుంది : కల్యాణ్ రామ్
X
‘గుహన్ నాకు ‘118’ మూవీతో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తున్న WWW సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది.’ అన్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్. ఈ చిత్రం టైటిల్ లోగోను గురువారం ఉదయం కల్యాణ్ రామ్ ఆవిష్కరించారు.

మూవీ లోగో లాంచ్‌ కార్యక్రమంలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... గుహన్ తో తాను చేసిన 118 మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న WWW మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందన్నారు. ఈ సినిమా కథ తనకు ఇంతకు ముందే తెలుసన్న కల్యాణ్ రామ్.. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆకాంక్షించారు.

కేవీ గుహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘118’ చిత్రంతోనే ఆయన తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇప్పుడు గుహన్ తెరకెక్కిస్తున్న WWW (హూ,వేర్‌,వై) చిత్రం రెండోది. ఇందులో అదిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వి పి.రాజు దా‌ట్ల నిర్మిస్తున్నారు. సిమ‌న్ కె. కింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు.