Begin typing your search above and press return to search.

సంక్రాంతి గుణపాఠం: కంటెంట్‌ ఉన్నా కూడా...

By:  Tupaki Desk   |   18 Jan 2016 11:30 AM GMT
సంక్రాంతి గుణపాఠం: కంటెంట్‌ ఉన్నా కూడా...
X
కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు అంటాడు పవన్‌ కళ్యాణ్‌. కాని కటౌట్‌ పెట్టడానికి ప్లేస్‌ మాత్రం ఉండాలి కదా? ఇష్టమొచ్చిన చోట కటౌట్‌ పెడతామంటే మున్సిపాలిటీ వారు ఫైన్‌ వేస్తారు. సో.. ఎమోషన్‌ కు రీజనింగ్‌ కు మధ్యన ఒక చిన్న లాజిక్‌ ఉంటుంది. ఆ లాజిక్‌ ను అర్ధం చేసుకోనివారికి.. ఈ సంక్రాంతి రిలీజ్‌ లు మాంచి గుణపాఠాన్నే నేర్పాయి.

ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల చేసేస్తే.. అవి బాక్సాఫీస్‌ దగ్గర వర్కవుట్‌ అవుతాయా? ఏం ఒకప్పుడు లేవా అనుకోవచ్చు. కాని అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అందుకే అప్పుడూ ఇప్పుడూ ఒకేలా వర్కవుట్‌ కావు. లెజండ్‌ సినిమాకు బ్లాక్ బస్టర్‌ టాక్‌ వస్తే.. తొలిరోజున 6.79 కోట్ల షేర్‌ వచ్చింది. కాని డిక్టేటర్‌ సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చిన కూడా 5.79 కోట్లు వచ్చసింది. అంటే సినిమా చూసేవారి సంఖ్య పెరిగిందనమాట. టిక్కెట్టును ఎక్కువ రేటుతో కొనేంతగా ప్రేక్షకుడి స్థాయి కూడా పెరిగిందనమాట. కాని సినిమా సోలోగా వచ్చుంటే.. ఓపెనింగ్‌ ఒక 8 కోట్ల షేర్‌ వరకు వచ్చుండేదేమో. సంక్రాంతి రేస్‌ లోకి దూకడం వలన ఆ షేర్‌ మిస్సయినట్లే కదా??

బ్రూస్‌ లీ సినిమాకు మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్‌ టాక్‌ వచ్చేసింది. కాని సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాలలో 12.66 కోట్లు వసూలు చేసింది. నాన్నకు ప్రేమతో సినిమాకు మిక్స్ డ్ నుండి ఎబోవ్‌ యావరేజ్‌ టాక్‌ వచ్చినా కూడా 12.13+ కోట్లే వచ్చింది. అంటే ధియేటర్లు లేకపోవడం వలనే కదా.. బ్రూస్‌ లీ కంటే ఎక్కువగా వసూళ్లు రాలేదు? నాన్నకు ప్రేమతో సోలోగా ప్లాన్‌ చేసుకునుంటే ఎంత బాగుండేది మరి? ఫ్లాప్‌ టాక్ తో ఖాతా ఓపెన్‌ చేసిన నాగార్జున ఢమరుకం సినిమా.. తొలిరోజున 4.5 కోట్లు షేర్‌ వసూలు చేసింది (తెలుగు రాష్ట్రంలలో). కాని స్వీట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ అనిపించుకున్న సోగ్గాడే చిన్ని నాయనా మాత్రం.. కేవలం 3.9 కోట్ల షేర్‌ ను మాత్రమే తెచ్చుకుంది.

సో.. ఇదంతా చూస్తుంటే.. కంటెంట్‌ సరిగ్గానే ఉన్నా కూడా.. ప్లేస్‌ మెంట్‌ లేకపోతే మాత్రం రెవిన్యూ విషయంలో దెబ్బపడుతుంది. ఇంతకంటే పెద్ద గుణపాఠం ఏముంటుంది మన నిర్మాతలు నేర్చుకోవడానికి. సంక్రాంతి 2016. ఎప్పటికీ మర్చిపోకండే!!