Begin typing your search above and press return to search.

'రాంగ్ గోపాల్ వర్మ' ట్రైలర్: శ్రీదేవి - వోడ్కా - బ్లూ ఫిలింస్ - తొడలు - అయాన్ రాండ్.. పంచభూతాలు

By:  Tupaki Desk   |   12 Oct 2020 4:30 PM GMT
రాంగ్ గోపాల్ వర్మ ట్రైలర్: శ్రీదేవి - వోడ్కా - బ్లూ ఫిలింస్ - తొడలు - అయాన్ రాండ్.. పంచభూతాలు
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని టార్గెట్ చేస్తూ ఈ మధ్య వరుసగా సెటైరికల్ మూవీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీకి సినిమాలతోనే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న కొందరు అతనిపై సినిమాలు తీస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే వర్మపై ఇప్పటికే 'పరాన్నజీవి' అనే మూవీని రిలీజ్ చేసారు. రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ''ఆర్జీవీ'' (రోజూ గిల్లే వాడు)తో పాటు ''పార్న్ జీవి - పెళ్ళాం వదిలేసిన ఒక దర్శకుడి కథ'' ''ఎవడ్రా నన్ను కొట్టింది'' ''రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌'' అనే సినిమాలు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ''రాంగ్ గోపాల్ వర్మ'' అనే మరో సినిమా రానుంది. ప్రముఖ రచయిత జర్నలిస్ట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

'జబర్థస్త్' షకలక శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో, టైటిల్ సాంగ్, టీజర్‌ లను ఇటీవలే విడుదల చేశారు. ఈ క్రమంలో 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్ర ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మూవీలో ఆర్జీవీ పాజిటివ్ నెగెటివ్ లు అన్నింటిపైనా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వర్మ పాత్రధారి 'నీకేం అర్థమైంది' అని అడగ్గా.. కత్తి మహేష్ సమాధానం ఇస్తూ.. ''అయాన్ రాండ్ - శ్రీదేవి - వోడ్కా - బ్లూ ఫిలింస్ - తొడలు.. ఈ ఐదు మీ పంచభూతాలు.. పంచ ప్రాణాలు అని అర్థమైంది సార్'' అని సమాధానం ఇచ్చారు. ట్రైలర్ లో ఆర్జీవీ పాత్రధారి తనకు తాను ఆత్మ విమర్శ చేసుకుంటున్నట్లు చూపించారు.

ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ''ఒక దర్శకుడి వింత పోకడలకు వెర్రి చేష్టలకు విసిగిపోయి వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని తెరకెక్కించాను. ఒక జర్నలిస్ట్‌ గా బాధ్యతతో బాధతో ఈ సినిమాను రూపొందించాను'' అని అన్నారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రభు - షకలక శంకర్ - సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ - ఛాయాగ్రాహకుడు బాబులతో పాటు ప్రముఖ పాత్రికేయులు వినాయకరావు - సురేష్ కొండేటి పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రభు ప్రకటించారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇది ఒకటని.. నా ఇన్స్పిరేషన్ రామ్ గోపాల్ వర్మ అని శంకర్ అన్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రభు తెలిపారు.