Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్ కోసం సెన్సేషనల్ రైటర్స్
By: Tupaki Desk | 25 May 2017 7:03 PM ISTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘180’ దర్శకుడు జయేంద్ర రెండు రోజుల కిందట అనౌన్స్ చేసిన సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘180’ అట్టర్ ఫ్లాప్ అన్న సంగతి పక్కన పెడితే.. అది పక్కా క్లాస్ సినిమా. మణిరత్నం స్టయిల్లో ఏదో ట్రై చేశాడు జయేంద్ర. అలాంటి దర్శకుడు మాస్ సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ను హీరోగా ఎంచుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఐతే టాప్ రేంజ్ టెక్నీషియన్లను ఎంచుకుని.. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుండటంతో ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లో ఓ స్పెషల్ మూవీ కావచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించబోతున్న సంగతి తెలిసిందే.
కళ్యాణ్ రామ్-జయేంద్ర సినిమాకు పని చేస్తున్న రచయితలు కూడా తక్కువ వాళ్లేమీ కాదు. ‘సుబ’ అనే కలం పేరుతో రచనలు చేసే సురేష్.. బాలకృష్ణ ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తుండటం విశేషం. వీళ్లిద్దరూ తమిళంలో బోలెడన్ని పుస్తకాలు రాశారు. సినిమాలకూ పని చేశారు. ‘రంగం’ దర్శకుడు కె.వి.ఆనంద్ కు వీళ్లంటే మహా గురి. ‘రంగం’తో పాటు అతను దర్శకత్వం వహించిన అయన్ (వీడొక్కడే), మాట్రన్ (బ్రదర్స్), అనేగన్ (అనేకుడు), కావన్ సినిమాలకు వాళ్లిద్దరూ పని చేశారు. దీంతో పాటు శంకర్ ‘ఐ’ చిత్రానికి కూడా రచనా సహకారం అందించారు. ప్రస్తుతం సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ ‘సంఘమిత్ర’కూ ఈ జంట రచయితలే మాటలు రాస్తుండటం విశేషం. ఇలాంటి రచయితలు స్క్రిప్టు అందిస్తున్నారంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని భావిస్తున్నార. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కూడా ఓ ప్రముఖుడినే తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు జయేంద్ర.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/