Begin typing your search above and press return to search.

ప్ర‌పంచానికి తెలియ‌ని సీతాదేవి క‌థ రాస్తున్న విజ‌యేంద్రుడు!

By:  Tupaki Desk   |   26 Feb 2021 2:00 PM IST
ప్ర‌పంచానికి తెలియ‌ని సీతాదేవి క‌థ రాస్తున్న విజ‌యేంద్రుడు!
X
బాహుబలి రచయిత కె.వి.విజేంద్ర ప్రసాద్ `సీత - అవతారం` అనే కొత్త స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు క‌థ‌లు అందించిన ఆయ‌న ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్ కి ప‌ని చేశారు. త‌దుప‌రి వెంట‌నే బహుభాషా చిత్రం `సీత‌- అవ‌తారం` కోసం తాజాగా క‌లం ప‌ట్టారు.

`సీత- ది ఇన్ కార్నేష‌న్` (హిందీ) పోస్ట‌ర్ ని తాజాగా రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆమేర‌కు మేకర్స్ గురువారం ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రకటించారు. హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. దేశాయ్ తో పాటు కథ-స్క్రీన్ ప్లేను అందించ‌నున్నారు. మనోజ్ ముంతాషీర్ ఈ చిత్రానికి సంభాషణలు సాహిత్యం అందించ‌నున్నారు.

భారతదేశపు అతిపెద్ద దైవిక ఇతిహాసం సీత - అవతారం ప్రీలుక్ ఆక‌ట్టుకుంది. ఇందులో సీత గురించి తెలీని క‌థ (అన్ ‌టోల్డ్ స్టోరీ)ను తెర‌పై చూపించ‌నున్నారు. హిందీ- తమిళం- తెలుగు- మలయాళం -కన్నడ భాషలలో ఈ మూవీ పాన్ ఇండియా కేట‌గిరీలో విడుదల కానుంది. `సీతా- ది అవతారం` పౌరాణిక క‌థాంశం కావ‌డంతో VFX ఆధారిత జ‌ర్నీ సాగించాల్సి ఉంటుంద‌ని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి తారాగణం ఇంకా ప్రకటించలేదు. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

భ‌జరంగీ భాయిజాన్- మగధీర- బాహుబలి: ది బిగినింగ్- బాహుబలి: ది కన్ క్లూజన్-మ‌ణిక‌ర్ణిక చిత్రాల‌కు విజ‌యేంద్రుడు స్క్రిప్టులు అందించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న ఆర్.ఆర్.ఆర్ కి ఆయ‌నే స్క్రిప్టు ర‌చ‌యిత‌.