Begin typing your search above and press return to search.

రోబో-2 సీక్రెట్ చెప్పేశాడు

By:  Tupaki Desk   |   22 Dec 2015 11:00 PM IST
రోబో-2 సీక్రెట్ చెప్పేశాడు
X
ప్రి ప్రొడక్షన్ టైం నుంచి విపరీతమైన ఆసక్తి రేపిన ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ‘రోబో-2’ ఎట్టలకేలకు మొదలైపోయింది. పెద్దగా హడావుడేమీ లేకుండా సినిమాను ఆరంభించాడు శంకర్. ఐతే ప్రి ప్రొడక్షన్ టైంలో ‘రోబో-2’ గురించి ఎన్నో వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరు చేస్తారనే విషయంలో రకరకాల రూమర్లు వచ్చాయి. చివరికి అక్షయ్ కుమార్ తో ఆ పాత్ర చేయించాలని ఫిక్సయ్యాడు శంకర్. ఇంతకు ఈ విలన్ పాత్రలో ఆర్నాల్డ్ నటిస్తాడని.. కమల్ హాసన్ పేరు కూడా పరిశీలించారని వార్తల్లో వాస్తవమెంత అన్నది జనాలకు తెలియలేదు.

ఐతే రోబో-2కు రచయితగా పని చేసిన ఫేమస్ రైటర్ జయమోహన్ ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు. రోబో-2కు సంబంధించి విశేషాలపై మాట్లాడుతూ.. ‘‘నేనీ సినిమాకు చాలా నెలల ముందే స్క్రిప్టు పూర్తి చేశా. డైలాగులతో సహా స్క్రిప్టు పనంతా అయిపోయింది. చిట్టి పాత్రను ఈసారి మరింత వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. రజినీకాంత్ వేగానికి, ఆయనలోని ఆవేశానికి తగ్గట్లు పాత్ర ఉంటుంది. ఇందులో విలన్ క్యారెక్టర్ ని బహుముఖ పాత్రలు పోషించగల ఓ ప్రముఖ తమిళ కథానాయకుడిని దృష్టిలో ఉంచుకుని రాశాం. ఆ తర్వాత ఈ పాత్రకు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ను అనుకున్నాం. కానీ కొన్ని అంతర్జాతీయ ఆర్థిక చట్టాలతో ముడిపడ్డ సమస్యల వల్ల ఆయనతో ఈ పాత్రను చేయించలేకపోయాం. చివరికి అక్షయ్ కుమార్ ను ఎంచుకున్నాం. రోబో కంటే కూడా ఇందులో విలన్ పాత్ర చాలా కీలకంగా, బలంగా ఉంటుంది’’ అన వెల్లడించారు జయమోహన్. ఈయన చెబుతున్న బహుముఖ పాత్రలు పోషించగల నటుడు కమల్ హాసనే అన్నది జనాల అభిప్రాయం.