Begin typing your search above and press return to search.
రైటర్ కమ్ డైరెక్టర్.. అదే తప్పు చేస్తున్నాడా..?
By: Tupaki Desk | 7 May 2023 5:07 PMఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు సినిమా గురించి వార్తలపై కూడా సినిమాపై అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా సినిమా అంతా సజావుగా షూటింగ్ జరుపుకుంటే ఏమో కానీ అలా కాకుండా రీ షూట్స్ లాంటివి జరుగుతుంటే మాత్రం తెలియకుండానే సినిమా మీద ఒక రకమైన బ్యాడ్ ఇంప్యాక్ట్ ఏర్పడేలా చేస్తాయి. ఇక రిలీజ్ తర్వాత ఆ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే అది రీ షూట్ ల వల్లే అని అనేస్తారు. లేటెస్ట్ గా ఏజెంట్ సినిమా పరిస్థితి ఇలానే అయ్యింది. అఖిల్ సినిమాను రీ షూట్స్ చేసి చేసి సినిమాను కిచిడి చేశారు.
అందుకే సినిమా రిజల్ట్ కూడా అదే విధంగా వచ్చింది. ఇక ఇదే దారిలో రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తన నెక్స్ట్ సినిమాను అదే విధంగా రీ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. రైటర్ గా కిక్, టెంపర్, ఎవడు, రేసు గుర్రం లాంటి సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ కిక్ 2, టచ్ చేసి చూడు రీసెంట్ ఏజెంట్ తో కూడా ఫ్లాప్ అందుకున్నాడు.
ఇక అతను డైరెక్టర్ గా మారి చేసిన సినిమా నా పేరు సూర్య. అల్లు అర్జున్ ని ఒప్పించి మరి ఆ సినిమా చేయగా అది కాస్త నిరాశపరచింది.
నా పేరు సూర్య హిట్ అయితే డైరెక్టర్ గా వరుస సినిమాలు చేసేవాడేమో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో స్టార్ హీరోలు ఎవరు వక్కంతం వంశీకి ఛాన్స్ లు ఇవ్వలేదు. ఫైనల్ గా నితిన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు వక్కంతం వంశీ.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకోగా పాతిక రోజులు షూటింగ్ జరిగిన తర్వాత అవుట్ పుట్ సరిగా రాలేదని మళ్లీ రీ షూట్ చేస్తున్నారట. నితిన్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. వక్కంతం వంశీ ఈసారి తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.
కానీ సినిమా రీ షూట్స్ చేస్తూ సినిమాపై బ్యాడ్ ఇంప్యాక్ట్ కలిగేలా చేస్తున్నారు. రైటర్ గా తన సత్తా చాటిన వక్కంతం వంశీ డైరెక్టర్ గా మాత్రం క్లిక్ అవలేకపోతున్నాడు. నితిన్ సినిమా తేడా కొడితే మాత్రం ఇక అతను డైరెక్టర్ గా మానేసి రైటర్ గా కొనసాగడం బెటర్ అని చెప్పొచ్చు.