Begin typing your search above and press return to search.

అతనితోనే జతకడుతున్న శంకర్

By:  Tupaki Desk   |   25 Jan 2018 3:53 PM IST
అతనితోనే జతకడుతున్న శంకర్
X
ఇండియాలో ఉన్న ప్రముఖ దర్శకుల్లో శంకర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్ స్థాయిని ఇంటర్నేషనల్ మార్కెట్ కు టచ్ చేసిన శంకర్ మినిమమ్ సక్సెస్ రేట్ కలిగిన దర్శకుడిగా పేరు పొందాడు. ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక సందేశాన్ని ఇచ్చే సోషల్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటూ సినిమాలను చేస్తుంటాడు. ప్రస్తుతం అందరు రజినీకాంత్ - అక్షయ్ కుమార్ తో ఆయన డైరెక్ట్ చేసిన 2.0 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే 2.0 తరువాత శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు సినిమాకు సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకుముందే ఆ విషయాన్ని అందరికి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం శంకర్ ఒక స్పెషల్ రైటర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. మణిరత్నం - బాలా వంటి దర్శకులకు తన రచన సహాయాన్ని అందించిన జేయమోహన్ భారతీయుడు 2 సినిమాకు కూ రైటర్ గా సెలెక్ట్ అయ్యారు.

జేయమోహన్ 2.0 సినిమాకు కూడా వర్క్ చేశాడు. ఆయన పెన్ పవర్ నచ్చడంతో శంకర్ సెకండ్ టైమ్ మళ్లీ ఆయనతో పని చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అయితే జేయమోహన్ ని మురగదాస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ విజయ్ తో చేయబోయే సినిమా కోసం మురగదాస్ ఈ రైటర్ తో కథ చర్చలను జరుపుతున్నాడు. డైలాగ్స్ రాయడానికి రెడీ అయ్యాడు. ఇక భారతీయుడు సీక్వెల్ ను 2.0 సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్ వారే ప్రొడ్యూస్ చేయనున్నారు. 2.0 రిలీజ్ తరువాత శంకర్ ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.