Begin typing your search above and press return to search.

వావ్.. సిక్స్ ప్యాక్ తో అల్లు బ్రదర్ స్టన్నింగ్ లుక్..!

By:  Tupaki Desk   |   21 May 2021 5:31 AM GMT
వావ్.. సిక్స్ ప్యాక్ తో అల్లు బ్రదర్ స్టన్నింగ్ లుక్..!
X
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. లుక్స్ పరంగా అన్న బన్నీని పోలి ఉండే శిరీష్.. ఇప్పుడు ఫిజిక్ లో కూడా బ్రదర్ కి పోటీ ఇస్తున్నాడు. పూర్తిగా తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేసి పిచ్చెక్కిస్తున్నాడు.

తాజాగా అల్లు బ్రదర్ సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేసిన మిర్రర్ సెల్ఫీ చూస్తే ఎవరైనా వావ్ అనకమానరు. జిమ్ లో సిక్స్ ప్యాక్ బాడీతో ఔరా అనిపిస్తున్నాడు. ఈయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీని కోసం వర్క్ఔట్స్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, అన్న అల్లు అర్జున్ బాటలో ఇండస్ట్రీకి వచ్చి 'గౌరవం' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు శిరీష్. 'శ్రీరస్తు శుభమస్తు' 'ఒక్క క్షణం' వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. కమర్షియల్ సినిమాల కంటే కూడా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు పరుగులు తీస్తున్నాడు శిరీష్. 'ఎబిసిడి' హిందీ డబ్బింగ్ సినిమాతో ఉత్తరాదిన కూడా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల 'విలాయటి శరాబ్‌' అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సత్తా చాటాడు.

'ఎబిసిడి' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్.. ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. దీని కోసమే పూర్తిగా తన మేకోవర్ చేంజ్ చేశాడు అల్లు వారబ్బాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 30న అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఓ పాన్ సౌత్ మూవీ చేయనున్నాడు శిరీష్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.