Begin typing your search above and press return to search.

బ‌న్ని కంటే ఎన‌ర్జిటిక్ గా ఉంటాడా పూజా?

By:  Tupaki Desk   |   27 May 2021 10:00 PM IST
బ‌న్ని కంటే ఎన‌ర్జిటిక్ గా ఉంటాడా పూజా?
X
అత‌డేమో పెళ్ల‌యిన హీరో.. ఆమె పెళ్లి కావాల్సిన మిడిలేజీ యువ‌తి. కానీ అత‌డి నుంచి ఆమె చాలానే సంగ్ర‌హిస్తోంది. అత‌డి నుంచి ఎన‌ర్జీని ప‌రిశీల‌నా శ‌క్తిని లాక్కోవాల‌ని ట్రై చేస్తోంద‌ట‌. ప‌దునైన అత‌డి క్వాలిటీస్ ని తెగ పొగిడేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌.. ఎవ‌రా హీరో? అంటే.. ఇంకా పెళ్లి కాని ఆ అందాల భామ పూజా హెగ్డే. పెళ్ల‌యిన ఆ హీరో ర‌ణ‌వీర్ సింగ్.

పూజా ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న సిర్కస్ చిత్రంలో నటిస్తున్నారు. రణవీర్ సింగ్ హీరో. జాక్వెలిన్ ఫెర్నాండెజ్- పూజా హెగ్డే క‌థానాయిక‌లు. తన సహనటుడు రణబీర్ గురించి మాట్లాడుతూ పూజా తన శక్తిని అరువుగా తీసుకోవాలనుకుంటున్నానని అన్నారు. నేను అతని నుండి (రణ్‌వీర్) ఏదైనా తీసుకోగలిగితే.. అతని శక్తిని పరిశీలనా శక్తిని కూడా తీసుకుంటాను. అతను చాలా పదునైనవాడు. దేనినీ విడిచిపెట్ట‌డు. నేను అంతర్ముఖిని. రణ్‌వీర్ దీనికి పూర్తి వ్యతిరేకం. కొన్నిసార్లు నేను అతనిలాగే ఉండాలని కోరుకుంటున్నాను. శక్తివంతమైన అద్భుతమైన మాట‌కారి అత‌డు. అతని కామిక్ సెన్స్ అద్భుతమైనది అని అన్నారు.

నిజానికి పూజా ఏనాడూ ఇత‌ర హీరోల గురించి అంతగా ఇద‌వ్వ‌లేదు. పూజా ఈ చిత్రంలో సానుకూల‌ శక్తి ప్రకంపనల గురించి విస్మయంతో ఉంది. అన్న‌ట్టు ర‌ణ‌వీర్ ఎన‌ర్జీతో పోలిస్తే బ‌న్ని ఎన‌ర్జీ ఏ లెవ‌ల్లో ఉన్న‌ట్టు? అత‌డితోనూ అల వైకుంఠ‌పుర‌ములో న‌టించింది కాబ‌ట్టి పూజా పోలిక చెబుతుందేమో చూడాలి. సిర్కస్ షేక్ స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కి అనుకరణ. కోవిడ్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది. 2022 లో విడుదల కానుంది.