Begin typing your search above and press return to search.

అమ్మాయిని కాపాడితేనే ప్ర‌పంచం మిగిలేది!

By:  Tupaki Desk   |   7 May 2022 2:18 PM GMT
అమ్మాయిని కాపాడితేనే ప్ర‌పంచం మిగిలేది!
X
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆద‌ర‌ణ‌కు కొద‌వేమీ లేదు. కాన్సెప్ట్ న‌చ్చితే సెంటిమెంట్ వ‌ర్క‌వుటైతే హిట్టు కొట్ట‌డం క‌ష్టం కాదు. తాజాగా ఇంద్రాణి చిత్రం నుండి నటి గరిమా కౌశల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ఈ చిత్రంలో గరిమా ముఖ్య‌ పాత్ర పోషిస్తున్నార‌ని.. ఇంద్రాణి కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని మేకర్స్ పేర్కొన్నారు.

ఇంద్రాణి ప్రధాన కథాంశం సంగీత దర్శకుడు సాయికార్తీక్ కి బాగా కనెక్ట్ అయ్యిందని దర్శకుడు స్టీఫెన్ పేర్కొన్నాడు.

ప్రపంచాన్ని రక్షించడానికి అమ్మాయిని రక్షించు అనే క్యాప్షన్ తో ఈ సినిమా రూపొందింది. సాయికార్తీక్ ఈ సినిమా క‌థ‌ను విని కంపోజ్ చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ శీర్షిక ఆధారంగా ప్రత్యేక టైటిల్ సీక్వెన్స్ పాటను రూపొందించార‌ని తెలిపారు.

సైన్స్ ఫిక్షన్ .. కామెడీ.. అడ్వెంచర్.. ఎమోషన్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. డ్రామా.. డ్యాన్స్ నంబర్ లు .. యాక్షన్ సీక్వెన్స్ లతో ఎంతో బ్యాలెన్స్ డ్ గా తెర‌కెక్కిన మొదటి మహిళా సెంట్రిక్ ఫిల్మ్ అవుతుంది... అని అన్నారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్స్ లో ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ లో ఉన్న VFX ప్రీ విజువలైజేషన్స్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఇంద్రాణి షూటింగ్ అక్టోబ‌ర్ 27 విడుదల తేదీకి చేరుకోవడానికి శరవేగంగా జరుగుతోంది.

మ‌హిళా సెంటిమెంట్ తో ఎన్ని సినిమాలు వ‌చ్చినా వాటిని ప్ర‌జ‌లు ఆద‌రిస్తారు. సెంటిమెంట్ తో పాటు గ్రిప్పింగ్ నేరేష‌న్ వ‌ర్క‌వుటైతే చాలావ‌ర‌కూ లేడీ ఓరియెంటెడ్ క‌నెక్ట‌వుతున్నాయి. ఇంద్రాణి కాన్సెప్ట్ ఏ మేర‌కు క‌నెక్ట‌వుతుందో వేచి చూడాలి.