Begin typing your search above and press return to search.

విశ్వనటుడు డిశ్చార్జ్! త్వరలోనే తిరిగి షూటింగ్ లోకి..

By:  Tupaki Desk   |   22 Jan 2021 3:47 PM GMT
విశ్వనటుడు డిశ్చార్జ్! త్వరలోనే తిరిగి షూటింగ్ లోకి..
X
ఇండియన్ స్టార్ యాక్టర్ కమల్ హాసన్ గత కొంతకాలంగా సినిమాల విషయంలో వేగం తగ్గించాడు. ఎందుకంటే మొన్నటి వరకు కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లకు తెరపడింది. కానీ ఈ మధ్య కరోనా వ్యాప్తి తగ్గి ప్రభుత్వాల నుండి పూర్తి అనుమతులు లభించడంతో షూటింగ్స్ వేగంగా ముగిస్తున్నారు. కానీ కరోనా నిబంధనలు కంపల్సరీ. అయితే స్టార్ హీరో కమల్ హాసన్ ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు పొలిటికల్ లైఫ్ కూడా మెయింటైన్ సమానంగా మెయింటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కమల్ చేతిలో భారీ సినిమాలున్న సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు ఎన్నికలలో కమల్ తన పార్టీ 'మక్కల్ నిధిమయ్యమ్' తరపున పోటీ చేయనున్నాడు. అయితే సడన్ గా ఇటీవల పార్టీ ప్రచారాలను నిలిపేశాడు కమల్. ఎందుకో అనుకుంటుండగా అయన కూతురు హీరోయిన్ శృతిహాసన్.. తన తండ్రికి ఓ శస్త్రచికిత్స జరిగినట్టు ప్రకటించింది.

ఈ వార్త తెలిసి అంతా షాక్ తిన్నారు. అయితే తాజాగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. శ్రీ రామచంద్ర మెడికల్ హాస్పిటల్ లో కాలికి సంబంధించిన శస్త్రచికిత్స కోసం అడ్మిట్ అయిన కమల్ పూర్తిగా విజయవంతంగా కోలుకున్నట్లు తెలిపారు వైద్యసిబ్బంది. అయితే శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. కానీ మరికొన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారట వైద్యులు. అందుకే మరికొన్ని రోజులు బ్రేక్ తీసుకొని కమల్ రాజకీయాలు, సినిమా షూటింగ్స్ లలో పాల్గొంటాడని సమాచారం. అయితే ప్రస్తుతం కమల్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 సినిమా చేస్తూనే, మరోవైపు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుండి విడుదలైన ఫస్ట్ లుక్స్, ఇంట్రడక్షన్ వీడియోస్ ఫుల్ బజ్ క్రియేట్ చేసాయి. చూడాలి మరి మళ్లీ ఈ భారీ సినిమాలతో కమల్ ఫామ్ లోకి వస్తాడేమో!