Begin typing your search above and press return to search.

గంటన్నరలో సినిమా పూర్తి చేసి వరల్డ్ రికార్డు సాధించారు..!

By:  Tupaki Desk   |   28 Oct 2022 1:30 PM GMT
గంటన్నరలో సినిమా పూర్తి చేసి వరల్డ్ రికార్డు సాధించారు..!
X
ఈరోజుల్లో ఒక సినిమాను తెరకెక్కించాలంటే కనీసం నాలుగైదు నెలలైనా పడుతుంది. స్టార్ హీరోల సినిమాలైతే ఏకంగా ఏడాది, రెండేళ్లు పడుతాయి. శంకర్.. రాజమౌళి సినిమాలైతే ఏళ్ళు గడిచి పోతుంటాయి. దర్శకుడి అభిరుచి, నిర్మాత పెట్టే ఖర్చును బట్టి సినిమాను తెరకెక్కించే రోజుల సంఖ్య ఆధారపడి ఉంటుందని అందరికీ తెల్సిందే.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సినిమా తీసే రోజుల సంఖ్య కొంతమేర తగ్గింది. అదే సమయంలో ఖర్చు మాత్రం భారీగా పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే ఓ తమిళ సినిమా కేవలం గంటర్నలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్యాకప్ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతోపాటు సినిమా చరిత్రలో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో 3.6.9 అనే సినిమాను కొత్త దర్శకుడు శివ మాధవ్ తెరకెక్కించాడు. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు కే. భాగ్యరాజ్ ఇందులో కథానాయకుడిగా నటించారు. 3..6.9 మూవీని పీజీఎస్ ప్రొడక్షన్స్ అధినేత పీజీఎస్.. ఫ్రైడే ఫిలిమ్స్ అధినేత కెప్టెన్ ఎంపీ ఆనంద్ సంయుక్తంగా నిర్మించారు.

వరల్డ్ రికార్డే లక్ష్యంగా ఈ సినిమాను 81 నిమిషాలపాటు ఏకదాటిగా సింగిల్ షాట్లోలోనే తెరకెక్కించడం విశేషం. ఇందుకోసం 24 కెమెరాలను ఉపయోగించారు. 150మంది నటీనటులు.. 450 మంది సాంకేతిక వర్గం ఈ సినిమా కోసం పని చేసింది. నాలెడ్జ్ ఇంజనీరింగ్ సంస్థ రూపొందించిన షరీఫా అనే టెక్నాలజీ ద్వారా అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డు యూనియన్ సినిమాను పర్యవేక్షించింది.

ఈ మేరకు సదరు సంస్థ 3.6.9 సినిమాకు వరల్డ్ రికార్డును ప్రధానం చేసినట్లు చిత్ర నిర్మాతలు తాజాగా ప్రకటించారు. ఇటీవలీ ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సాలీగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఏదిఏమైనా 3.6.9 మూవీ ప్రపంచ రికార్డు నెలకొల్పడం ద్వారా అందరినీ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.