Begin typing your search above and press return to search.

బాక్స్ ఆఫీస్ వసూళ్ళకు ఫైనల్ దెబ్బ!

By:  Tupaki Desk   |   10 July 2019 4:37 AM GMT
బాక్స్ ఆఫీస్ వసూళ్ళకు ఫైనల్ దెబ్బ!
X
అదేంటి అని హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోకండి. మ్యాటర్ వేరే ఉంది. కేవలం ఒక్క ఓటమితో మన ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ దాకా అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న వర్షం పడకపోతే ఆ లాంఛనం కూడా పూర్తయ్యి చివరి పోరుకు సిద్ధమయ్యేది. ఇవాళ మ్యాచ్ ఆగిపోయినా సాగినా మనం తుదిపోరులో ఉండటం ఖరారే. అది ఆదివారం 14న జరగనుంది. ఇక్కడ ఈ ప్రస్తావన తేవడానికి కారణం ఉంది.

ఈ శుక్రవారం 12న ఒకటి కాదు ఏకంగా నాలుగు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. దేనికీ భీభత్సమైన హైప్ లేకపోయినా డీసెంట్ బజ్ తో మౌత్ పబ్లిసిటీనే ఆధారంగా చేసుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఆనంద్ దేవరకొండ-శివాత్మికల దొరసాని- సందీప్ కిషన్ నిను వీడని నీడను నేనే - మేఘాంశ్ శ్రీహరి రాజదూత్ - ఆర్ నారాయణమూర్తి మార్కెట్ లో ప్రజాస్వామ్యం ఒకే రోజు వస్తున్నాయి. ఇవి కాకుండా మరో రెండు మూడు చిన్నా చితకా సినిమాలు కూడా ఉన్నాయి

వీటికి మొదటి వీకెండ్ చాలా ముఖ్యం. అందులోనూ ఆదివారం వసూళ్లకు చాలా కీలకంగా నిలుస్తుంది. అదే రోజు ఫైనల్ ఉండటం మధ్యాన్నం మూడు గంటలకే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాట్నీ నుంచే ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. హాట్ స్టార్ లాంటి ఆన్ లైన్ యాప్ లో లీగ్ మ్యాచెసే సుమారుగా 10 మిలియన్లకు పైగా చూసేవారు.

ఇక ఫైనల్ అంటే దీనికి ఐదింతలు కౌంట్ ఉంటుంది. రెగ్యులర్ శాటిలైట్ ద్వారా చూసే వాళ్ళను కౌంట్ చేయడం కష్టం. సో ఎంత లేదనుకున్నా ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ పోటీ పడుతున్నవన్నీ మీడియం రేంజ్ సినిమాలు. వారం దాటితే 18న మళ్ళీ కొత్త మూవీస్ క్యూలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కప్ సాధించాలని మొక్కుకుంటూనే వీటికి కూడా వసూళ్లు రావాలని కోరుకోవాలి. అంతకు మించి చేయగలిగేది ఏముంది.