Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ కోసం వరల్డ్ క్లాస్ బీజీఎం

By:  Tupaki Desk   |   13 Nov 2021 4:50 AM GMT
రాధేశ్యామ్‌ కోసం వరల్డ్ క్లాస్ బీజీఎం
X
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్‌ సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 14న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా మొదటి పాట విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈనెల 15న మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సమయంలో సినిమాకు సంగీతాన్ని అందించిన మన్నన్ భరద్వాజ్ ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు. అతడు ఈ సినిమా కోసం నిద్రలేని రాత్రులను గడిపినట్లుగా పేర్కొన్నాడు. ఒక్కో పాట కోసం పదుల కొద్ది వర్షన్ లను రెడీ చేసినట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ఎన్నో రికార్డింగ్ లు.. ఎన్నో ఎడిటింగ్స్ తో చాలా నిజాయితీగా రాధే శ్యామ్‌ కోసం చర్చలు జరిపి మ్యూజిక్ రెడీ చేశాం. ఖచ్చితంగా రాధే శ్యామ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.

ఈ సినిమా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ విషయంలో మొదటి నుండి మేకర్స్‌ చాలా స్పెషల్‌ శ్రద్దను తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే భారీ మొత్తంను ఖర్చు చసి వరల్డ్ క్లాస్ బీజీఎం ను ఈ సినిమా కోసం రెడీ చేయించినట్లుగా చెబుతున్నారు. దర్శకుడు చెప్పిన దాని ప్రకారం సినిమా కథ ను మ్యాచ్ చేసేందుకు చాలా వర్షన్‌ లను రెడీ చేసి చివరకు ఒక వర్షన్ ను ఫైనల్‌ చేయడం జరిగిందట. అలా రాధేశ్యామ్‌ సినిమా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఒక అద్బుతం అన్నట్లుగా వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ భాషలకు ఒక వర్షన్‌.. నార్త్‌ ప్రేక్షకుల కోసం హిందీలో ఒక వర్షన్ ను పాటలను రెడీ చేశారట.

బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా భాషలకు తగ్గట్లుగా ఉంటుందని అంటున్నారు. ఒక అద్బుతమైన సినిమాకు అంతకు మించి అద్బుతమైన బీజీఎం ను సమకూర్చడం ద్వారా సినిమా అందం మరింతగా పెరుగుతుందని అంటున్నారు. ప్రతి ఒక్క సన్నివేశం కూడా పీక్స్ లో ఉండేలా అద్బుతమైన బీజీ మ్యూజిక్ ఉండబోతుందట. సినిమా గురించిన ప్రతి విషయం కూడా ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ ను వచ్చేలా చేస్తున్నాయి. విక్రమాధిత్య పాత్రలో ప్రభాస్ మోడ్రన్‌ జ్యోతిష్యుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర తరహాలో ప్రభాస్‌ మాత్రమే కాకుండా మరెవ్వరు కూడా ఇండియన్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక హీరోయిన్‌ పూజా హెగ్డే పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. కృష్ణం రాజు.. మిథున్ చక్రవర్తి.. జగపతిబాబు తో పాటు ఇంకా ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ మరియు ఇతర భాషల స్టార్స్ ఈ సినిమాలో నటించారు. సంక్రాంతికి ఈసినిమా దేశ వ్యాప్తంగా విడుదల అయ్యి సాహోను మించిన వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. వరల్డ్ క్లాస్ మూవీగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చెబుతున్నారు. కనుక వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉంటాయేమో చూడాలి.