Begin typing your search above and press return to search.

మేక‌ప్ విష‌యంలో ఆ బ్యూటీ దాచిన క‌ఠోర నిజాలు

By:  Tupaki Desk   |   25 July 2020 12:00 PM IST
మేక‌ప్ విష‌యంలో ఆ బ్యూటీ దాచిన క‌ఠోర నిజాలు
X
ఎవ‌రైనా నేను అందగ‌త్తెను కాదు అని బ‌హిరంగంగా ఫ్యాన్స్ కి చెప్పేస్తారా?.. ముఖంపై ముడుత‌ల్ని.. ఉబ్బిన క‌ళ్ల‌ను.. పండిపోయిన త‌ల వెంట్రుక‌ల్ని డైరెక్టుగా లైవ్ లో చూపించేస్తారా? అదీ ఓ సెల‌బ్రిటీ అలా చేయాలంటే ఎంతటి తెగువ కావాలి? అంతః సౌంద‌ర్యాన్ని మ‌రిచి బాహ్య సౌంద‌ర్యాన్ని ప్రేమించే మాస్ అభిమానుల‌కు ఇలాంటివి షాక్ కి గురి చేయడం ఖాయం.

ఇంత‌కుముందు ప‌లువురు క‌థానాయిక‌లు త‌మ ఒరిజిన‌ల్ రూపాన్ని బ‌య‌ట‌పెట్టారు. అస‌లు నా ఒరిజిన‌ల్ రూపం ఇదీ! అంటూ చంద‌మామ కాజ‌ల్ మేక‌ప్ లెస్ రూపాన్ని బ‌య‌ట‌పెడుతూ ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. అందం కంటే మంచి మ‌న‌సు ముఖ్య‌మ‌ని అది త‌న‌కు ఉంద‌ని .. అయినా త‌న ఒరిజిన‌ల్ రూపాన్ని దాచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌న‌ని ప్ర‌క‌టించి కొన్ని ఫోటోల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కాజ‌ల్ వాస్త‌విక ముఖాకృతి చూశాక అంతా షాక్ కి గుర‌య్యారు. అభిమానులు అయితే న‌మ్మ‌లేక‌పోయారు.

తాజాగా ఎన్టీఆర్ క‌థానాయిక స‌మీరా రెడ్డి మేక‌ప్ లెస్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. తాను కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడు వికృత‌మైన త‌న రూపాన్ని క‌వ‌ర్ చేసుకునేందుకు చాలానే శ్ర‌మించాన‌ని తెలిపింది. తన‌కు ఎందులోనూ ప‌రిపూర్ణత లేద‌ని.. శ‌రీర ఆకృతిలో లోపాల్ని క‌ప్పి పుచ్చేందుకు ప్యాడ్స్ ఉప‌యోగించాన‌ని తెలిపింది. ముఖాకృతిని అందంగా చూపించేందుకు మేక‌ప్ ని.. కళ్ళు కాంతివంతం చేయడానికి లెన్స్ కూడా ఉపయోగించింద‌ట‌. త‌న వాచిన క‌ళ్ల‌ను క‌వ‌ర్ చేసేందుకు ర‌క‌ర‌కాల మేక‌ప్ విధానాల్ని అనుస‌రించాన‌ని స‌మీరా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

అస‌లు తాను అలా చేయ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే సోష‌ల్ మీడియాల్లో త‌న‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు వినించేవిట‌. తాను అంత అందంగా లేన‌ని ప‌లువురు మ‌హిళ‌లు త‌న‌ని తిట్టేవార‌ని అవి త‌న‌ను ఎంతో బాధించేవ‌ని స‌మీరా తెలిపారు‌. అందుకే త‌న ఒరిజిన‌ల్ రూపాన్ని ఇప్పుడిలా ఓప‌న‌ప్ అయ్యార‌న్న‌మాట‌. స‌మీరారెడ్డి ఇటీవ‌లే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాల్లో ప్రీమెట‌ర్నిటీ స‌మ‌స్య‌ల‌పైనా ర‌క‌ర‌కాల విష‌యాల్ని షేర్ చేసుకున్నారు. అధిక బ‌రువుతో బాలింత‌ల స‌మ‌స్య‌లు ఎలా ఉంటాయో .. అందం గురించి ఎంత‌గా క‌ల‌వ‌రిస్తారో కూడా ప్ర‌తిదీ దాచుకోకుండా ఓపెనైంది స‌మీరా.