Begin typing your search above and press return to search.

ఊ.. ఆ..అహ అహ అనిపిస్తార‌ట‌

By:  Tupaki Desk   |   20 April 2022 6:45 AM GMT
ఊ.. ఆ..అహ అహ అనిపిస్తార‌ట‌
X
విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫ‌న్ అండ్ ఫ్ర‌ష్ట్రేష‌న్ తో ఆద్యంతం ఆక‌ట్ట‌కుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద ఊహిచ‌ని విధంగా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి ఔరా అనిపించింది. ఏకంగా వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది.

దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా 'ఎఫ్ 3'ని అదే టీమ్ తో తెర‌కెక్కించారు అనిల్ రావిపూడి. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రం మే 27న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ తో పోలిస్తే మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సునీల్‌, అంజ‌లి, సోనాల్ చౌహాన్ తో పాటు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేపై ప్ర‌త్యేక గీతాన్ని కూడా చిత్రీక‌రించ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఫ‌స్ట్ పార్ట్ ని మించి వినోదంతో తెర‌కెక్కించిన ఈ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేశారు.

అందులో భాగంగా 'ఊ...ఆ.. ఆహా ఆహా..' అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ పాట‌ని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో ముందుగా లిరిక‌ల్ ప్రోమోని విడుద‌ల చేసింది చిత్ర బృందం.

విక్ట‌రీ వెంక‌టేష్‌, త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ - మెహ్రీన్‌, సునీల్ ల‌పై ఈ పాట‌ని చిత్రీక‌రించారు. ఈ పాట‌తో ఊ ఆ..అహ అహ అనిపిస్తార‌ట‌. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

సునిధి చౌహాన్‌, ల‌విత లోబో, సాగ‌ర్‌, ఎస్పీ అభిషేక్ ఆల‌పించారు. ఈ పాట‌లో హీరోయిన్ లిద్ద‌రు ఊ ఆ..అహ అహ అనిపించేలా వున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని ఈ పాట‌తో మ‌రింత స్పైస‌ప్ చేపిన‌ట్టుగా క‌నిపిస్తోంది. బ్లాక్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మిల్కీ బ్యూటీ ర‌చ్చ ర‌చ్చ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక మెహ్రీన్ కూడా అదే స్థాయిలో బ్లూ సారీ.. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధ‌రించి హోయ‌లు పోయింది. వెంకీ, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ క‌లిసి ర‌చ్చ చేసిన ఈ పాట‌లో సునీల్ త‌న‌దైన స్టెప్పుల‌తో మెరిపించ‌బోతున్నాడు.

గ‌త కొన్ని రోజులుగా వ‌రుసగా వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మే 27న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఫ‌స్ట్ పార్ట్ ని మించి 'ఎఫ్ 3'ని అనిల్ రావిపూడి ఏ రేంజ్ లో తెర‌కెక్కించ‌డాఓ తెలియాలంటే మే 27 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. అంజ‌లి, రాజేంద్ర ప్ర‌సాద్‌, సునీల్‌, ముర‌ళీశ‌ర్మ‌, అలీ, తుల‌సీ,, ఝాన్సీ, ప్ర‌గ‌తి, ప్ర‌దీప్‌, వై.విజ‌య‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టించారు.