Begin typing your search above and press return to search.

`వండర్ ఉమెన్` సీక్వెల్ ఇండియా రిలీజ్ తేదీ

By:  Tupaki Desk   |   4 Dec 2020 12:48 PM IST
`వండర్ ఉమెన్` సీక్వెల్ ఇండియా రిలీజ్ తేదీ
X
తొమ్మిది నెల‌ల క్రైసిస్ అనంత‌రం ఇప్పుడిప్పుడే వినోద‌ప‌రిశ్ర‌మ కుదుట‌ప‌డుతోంది. నెమ్మ‌దిగా ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని వైపుల నుంచి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ఈ క్రిస్మ‌స్ నుంచి థియేట‌ర్ల‌ల‌లో సినిమాలో సంద‌డి పెద్ద స్థాయిలోనే ఉండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే నోలాన్ తెర‌కెక్కించిన హాలీవుడ్ మూవీ టెనెట్ ఇండియాలో రిలీజైంది. త‌దుప‌రి టాలీవుడ్ నుంచి సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈలోగానే మ‌రో శుభ‌వార్త‌. సంచ‌ల‌నాల వండ‌ర్ ఉమెన్ ఇండియా రిలీజ్ తేదీ ఖాయ‌మైంది. క్రిస్మస్ స్పెషల్ గా 2020 డిసెంబర్ 25 న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అవుతుందని `వండర్ ఉమెన్ 1984` నిర్మాతలు ఎట్టకేలకు ప్రకటించారు. అయితే ఈ మూవీ ముందే చెప్పిన తేదీ కంటే ఒక‌రోజు ముందే అంటే డిసెంబర్ 24 న భారతదేశంలో విడుదల కానుంది.

25 డిసెంబర్ డిజిటల్ ప్లాట్ ‌ఫామ్- హెచ్‌బిఓ మాక్స్ ‌తో పాటు అమెరికా అంతటా థియేట్రికల్ రిలీజ్ తో ఏకకాలంలో విడుదల కానుంది. ఒక‌రోజు ముందే ఇండియాలో రిలీజ‌వుతుంది. ఈ చిత్రం 2017 బ్లాక్ బస్టర్ డిసి సూపర్ వుమన్ చిత్రం `వండర్ ఉమెన్` కు సీక్వెల్. పాటీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో న‌టించారు.