Begin typing your search above and press return to search.

సల్మాన్ బాడీగార్డ్ నుంచి బెదిరింపు కాల్స్

By:  Tupaki Desk   |   23 Oct 2017 2:16 PM IST
సల్మాన్ బాడీగార్డ్ నుంచి బెదిరింపు కాల్స్
X
ప్రతి ఏడాది బాలీవుడ్ లో సంచలనం సృష్టించే బిగ్ బాస్ షో ఈ సారి స్టార్ట్ అయినా కొన్ని రోజులకే వివాదాలను తాకుతోంది. అత్యధిక ఆదరణ పొందిన ఈ షో ప్రస్తుతం 10వ సీజన్ కి కూడా మంచి రేటింగ్ ను అందుకుంటోంది. కానీ ఇప్పుడు ఏకంగా సల్మాన్ పైనే పొలిసు కేసులు నమోదు అవుతున్నాయి. సల్మాన్ బిగ్ బాస్ 11వ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇటీవల మొదటి కంటెస్టెంట్ జుబైర్ ఖాన్ ఎలిమినేటి అయ్యాడు. అసలే వివాదాలకు దగ్గరగా ఉండే ఇతడు ఇప్పుడు షోను కూడా మరింత వివాదాల్లోకి నెట్టేశాడు. సల్మాన్ ఖాన్ తనను కుక్క అన్నాడని రీసెంట్ గా కేసు నమోదు చేశాడు. అయితే రీసెంట్ గా మరో కారణం చేత.. జుబైర్ కు సపోర్టునిస్తున్న ఓ మహళ.. సల్మాన్ బాడీ గార్డ్ పై కూడా కేసు నమోదు చేసింది.

బాడీగార్డ్ షేరా మ్యాటర్ ను సాల్వ్ చేసుకుందామని కోరుతూ కేసును వెనక్కి తీసుకోవాలని కోరాడని చెప్పింది. అంతే కాకుండా తన నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని. తనపై దాడి చేసి 10 మందిని రేప్ చేయడానికి పంపిస్తాను అన్నాడు.. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు చేసింది. ఆమె ఆ కాల్స్ డేటాను పోలీసులకు అందించనట్లు తెలుస్తోంది.